కర్నూలు ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తొలి స్వాతంత్ర యోధుడిగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. కానీ ఆయనకు దక్కాల్సిన గుర్తింపు చరిత్రలో లభించలేదు. చిరంజీవి సైరా చిత్రాన్ని ప్రారంభించిన తర్వాత నరసింహారెడ్డి జీవిత చరిత్రని దేశవ్యాప్తంగా ప్రజలు తెలుసుకుంటున్నారు. పాన్ ఇండియా మూవీగా అక్టోబర్ 2న విడుదలవుతోన్న సైరా చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. 

సౌత్ ఇండియన్ అన్ని భాషలతో పాటు హిందీలో కూడా సైరా చిత్రం విడుదల కానుంది. తాజాగా ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సైరా చిత్రం గురించి కామెంట్స్ చేశాడు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో శ్రీశాంత్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. 

శ్రీశాంత్ మాట్లాడుతూ.. సైరా టీజర్, ట్రైలర్స్ చూశాను.. బాహుబలి కన్నా పెద్ద చిత్రం. రిలీజ్ రోజున కానీ, ఆ తర్వాత కానీ సైరా చిత్రాన్ని తప్పకుండా చూస్తాను. హైదరాబాద్ లో టీమిండియా ఆడిన ఓ మ్యాచ్ సందర్భంగా చిరంజీవి సర్ ని కలుసుకున్నా. క్రికెట్ లో సచిన్ ఎలాగో.. సినిమాల్లో రజని సర్, చిరు సర్ లెజెండ్స్ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.