హీరో రాజశేఖర్ గాయాలపాలయ్యారు. ఆయన సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ గాయపడ్డారు. ప్రస్తుతం సర్జరీ జరిగింది. అయితే 36ఏళ్ల తర్వాత సరిగ్గా అదే నెలలో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.
హీరో రాజశేఖర్‌కి గాయాలు
హీరో రాజశేఖర్ గాయాలపాలయ్యారు. ఆయన షూటింగ్ సమయంలో గాయపడ్డారు. కుడికాలికి గాయమైంది. దీంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. దాదాపు నెల రోజులకుపైగానే రెస్ట్ తీసుకోవాల్సి వస్తోంది. రాజశేఖర్ కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ అవుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు శర్వానంద్ హీరోగా రూపొందుతున్న `బైకర్` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు ఆయన మరో రెండు సినిమాలు చేస్తున్నారు.
మూడు గంటలపాటు సర్జరీ
ఈ క్రమంలో ఇటీవల(నవంబర్25)న రాజశేఖర్ గాయపడినట్టు తాజాగా ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాజశేఖర్ కుడి కాలికి బలమైన గాయాలు అయ్యాయని, మడమ దగ్గర పెద్ద ఇంజ్యూరీ అయినట్టు తెలిసింది. గాయమైన వెంటనే హుటాహుటిన యూనిట్ సభ్యులు ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. వైద్యులు సర్జరీ చేశారు. ఈ సర్జరీ సుమారు మూడు గంటల పాటు సర్జరీ జరిగిందట. బలమైన గాయం కావడంతో బోన్ బయటకు వచ్చిందని, అందువల్ల సర్జరీకి మూడు గంటలు పట్టిందని సమాచారం.
నెల రోజులపాటు విశ్రాంతి
సర్జరీలో భాగంగా రాజశేఖర్ కాలిలో ప్లేట్స్ & వైర్ అమర్చారు. దీని వల్ల త్వరగా రికవరీ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నొప్పి భరిస్తూ రాజశేఖర్ సర్జరీ చేయించుకున్నారని, ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన రికవరీ అవుతున్నారు. సర్జరీ తర్వాత మూడు నుంచి నాలుగు వారాల పాటు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. అందువల్ల కొన్ని రోజులపాటు ఆయన చిత్రీకరణలకు దూరంగా ఉంటారు. జనవరి 2026 లో మళ్ళీ షూటింగ్ ప్రారంభించవచ్చు.
36ఏళ్ల తర్వాత మళ్లీ సేమ్
రాజశేఖర్ కు ఈ విధంగా గాయాలు కావడం మొదటిసారి కాదు. నవంబర్ 15, 1989లో 'మగాడు' షూటింగ్ చేస్తున్న సమయంలోనూ ఆయనకు గాయమైంది. అప్పుడు ఎడమ కాలికి గాయమైతే, ఇప్పుడు కుడి కాలికి గాయమైంది. ఇప్పుడు 35 ఏళ్ళ తర్వాత నవంబర్ నెలలో మళ్ళీ ఆయనకు గాయమైంది. గాయాలను సైతం లెక్క చేయకుండా యాక్షన్ సీన్లు చేస్తున్నారు. రాజశేఖర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ 'బైకర్'. అది కాకుండా మరో రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాల టైటిల్స్ ఖరారు చేయలేదు. రికవరీ తర్వాత ఆ రెండు సినిమాల చిత్రీకరణలు మొదలు అవుతాయని సమాచారం.


