అజయ్ కౌండిన్య అనే దర్శకుడు తెరకెక్కించిన 'ఎన్‌హెచ్ 47లో బూత్ బంగ్లా' అనే చిత్రం ఆడియో ఫంక్షన్ ఇటీవలే జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నటి రోజా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోపాటు మొత్తం ఇండస్ట్రీ మీద సంచలన కామెంట్స్ చేశాడు అజయ్ కౌండిన్య. చివరకు ఫిదా ఫేం గాయిత్రి గుప్తాను కూడా వదలకుండా నోటికొచ్చినోళ్లపై ఫైర్ అయ్యారాయన. రోజాపై ఆయన కామెంట్స్... రోజా గారు మా అమ్మలాంటి వారు, సీనియర్ యాక్టర్... ఆమెకు మా పాదాభివందనం. శాసన సభ్యురాలుగా ఉన్నారు. ఆమె ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్య గురించి మాట్లాడతారు. కానీ మా సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడరు. మా సమస్యల గురించి మాట్లాడరు. ఆమె ఇండస్ట్రీ వారి కోసం ఎలాంటి సహాయం చేసింది లేదు, ఆమెకు మాకు సహాయం చేయడం చేతకాదు. రామ్ గోపాల్ వర్మ విదేశీ ఆర్టిస్టును పెట్టి సినిమా తీశారు. విదేశీ ఆర్టిస్టును పెట్టే బదులు రోజా గారిని పెట్టి తీస్తే సూపర్ గా ఉండేది. ఇప్పటి కైనా రోజా గారు ఒప్పుకుంటే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పార్ట్ 1 సినిమా తీస్తాను.... అంటూ అజయ్ కౌండిన్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఈ విడియోలో...