దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతలు ఎంకరేజ్ చేసి చిన్న చిత్రాలను విడుదల చేస్తూండటంతో ఉత్సాహంగా కొత్త కాన్సెప్టులతో సినిమా లు చేస్తున్నారు యంగ్ ఫిల్మ్ మేకర్స్. అలా ఓ విభిన్న కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రం ‘ఎవరికీ చెప్పొద్దు’. దిల్ రాజు విడుదల చేస్తున్న ఈ సినిమా.. ఈ  జనరేషన్‌లో ఉన్నకులం సమస్యను ఎంటర్‌ టైనింగ్‌గా  ప్రస్తావించినట్లు  చెప్తున్నారు. కులం ఓ  లవ్ స్టోరీలో సమస్యను ఎలా  సృష్టించిందో ఫన్ గా చెప్పారని తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ని చూస్తే అర్దమవుతోంది.

సినిమా వివరాల్లోకి వెళితే...రాకేశ్‌ వర్రే హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఎవరికీ చెప్పొద్దు’. గార్గేయి యల్లాప్రగడ  హీరోయిన్ గా నటించారు. బసవ శంకర్‌ దర్శకత్వంలో క్రేజీ ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా ఈనెల 22న విడుదలకానుంది.

రాకేశ్‌ వర్రే మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత తరంలో ఉన్న సమస్యను బసవ శంకర్‌గారు వినోదాత్మకంగా హ్యాండిల్‌ చేశారు.సినిమా మొదటి నుంచీ చివరి వరకూ  అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది.  మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.  ఈ చిత్రానికి సంగీతం: శంకర్‌ శర్మ, కెమెరా: విజయ్‌ జె.ఆనంద్‌.