దీపికా పదుకునే శృంగార సంబంధాలన్నీ వివాదాస్పదమైనవని, సరైన శృంగార భాగస్వామిని ఎంచుకోవటం చాలా కష్టమైన పని అని, భాగస్వామి ఎదుగుదలను, అభిరుచుల్ని గౌరవించేవారు దొరకడం చాలా కష్టమని బాలీవుడ్ అందాల తార దీపికా పడుకునె అభిప్రాయ పడింది. ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ కు వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని అని దీపిక అంది.

 

“శృంగార సంబంధాలకు సంబంధించి చెప్పాలంటే.. అవి ఎంతో వివాదాస్పదమైనవి. ఎందుకంటే మన సక్సెస్ ను, అభిరుచుల్ని, మనం ఏంచేస్తున్నాం, ఎందుకు చేస్తున్నామనేది అర్థం చేసుకుని, మనం అతనికంటే ఎక్కువ డబ్బు సంపాదించినా మనల్ని ప్రేమిస్తూ.. తోడుండగలిగేవారిని దొరకబట్టడం చాలా కష్టం. అందుకే ఒక సంబంధంలో కొనసాగడం చాలా కష్టంతో కూడుకున్న పని.” అని దీపికా వెల్లడించింది.

 

ఒక్కోసారి అనూహ్యాంగా భారీ సక్సెస్ వచ్చినప్పుడు రాత్రికి రాత్రే మనకు రెక్కలొచ్చి ఎగురుతుంటాం. అలాంటప్పుడు రిలేషన్ షిప్స్ పరిక్షా సమయం వస్తుందంది దీపిక. “నాకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత సంబంధాలు కాలంతోపాటు బలపడ్డాయి. కానీ నా స్నేహితులు కొందరు వాళ్లంతవాళ్లే నాకు దూరమయ్యారు. నా స్కూల్ మేట్స్ కొందరు చిన్నప్పటికంటే ఎక్కువ సన్నిహితంగా మారారు. మేమంతా వీలైనంతగా టచ్ లో వుంటుంటాం” అంది.

 

నేను సాధించిన సక్సెస్ మూలంగా చాలా మంది వాళ్లంత వాళ్లే నాకు డిస్ కనెక్ట్ అయారు. దాని గురించి నేను పెద్దగా బాధపడలేదు. జీవితం అలా సాగుతుందంతే. మనకు చాలా సన్నిహితంగా వుండేవాళ్లు నిజంగా మన అనుకునే వాళ్లు అర్థం చేసుకుంటారు. అంది దీపికా.

 

హేమామాలిని బయోగ్రఫీ “హేమామాలిని: బియాండ్ ద డ్రీమ్ గర్ల్” లాంచ్ ఈవెంట్ లో దీపికా ప్రసంగించింది. తమ గోల్ రీచ్ కావటానికి ప్రతిఒక్కరు అంకితభావంతో పనిచేయాలని, పేరు ప్రఖ్యాతులు, త్యాగాలు రెండూ స్టార్ జీవితంలో సమానంగా వుంటాయని ఈ బాజీరావ్ మస్తానీ స్టార్ అంది.

 

“నేను కాలేజీకి కూడా వెళ్లలేదు. నా 11,12వ తరగతులు ఎలాగోలా పూర్తి చేసేశా, ఎందుకంటే అప్పటికే నేను మోడలింగ్ రంగంలో సక్సెస్ అయిపోయా. బెంగళూరులో వున్నప్పుడు ఢిల్లీ, ముంబైలాంటి నగరాలకు తిరగాల్సి వచ్చింది. నేను డిగ్రీ చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించా. రెగ్యులర్ వీలు కాక డిస్టాన్స్ లో ట్రై చేశా.  కానీ అది కూడా సాధ్యం కాలేదు. నా తల్లిదండ్రులు అప్పట్లో దీనిపై చాలా ఫీలయ్యారు.” అని దీపిక చెప్పింది.

 

ఇక హేమా మాలిని మాట్లాడుతూ.. టాప్ పొజిషన్ లో వుండటమంటే అదో “ఒంటరిగా అనిపించే స్థానం” అన్నారు. అది వ్యక్తిగతంగా కూడా అని అన్నారు. తనను పెళ్లి చేసుకోవటానికి చాలా మంది వచ్చారని, కానీ తన స్థానాన్ని అందుకోవటం వాళ్ల వల్ల కాలేదని హేమ అన్నారు. అలాంటి పొజిషన్ లో వుండటమంటే ఒంటరి తనం కాక మరేంటని హేమా అన్నారు. అలాంటి స్థానంలో వుండి వ్యక్తిగా తాను చాలా కాలం కష్టపడ్డానని హేమ అన్నారు.