Asianet News TeluguAsianet News Telugu

సొంతపెళ్లాన్నే రేప్ చేసి, గొంతు కోసి .. ట్రైలర్ లో ఇదీ కంటెంట్!

వెంకట్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌, కీలక పాత్రధారులుగా దండుపాళ్యం నాలుగో భాగం తెర‌కెక్కుతుంది. కేటీ నాయక్ దర్శకత్వంలో రూపొందిన దండుపాళ్యం 4 ను నవంబర్ 1న విడుదల చేయాలని నిర్ణయించారు. 

Dandupalyam 4 Telugu Movie TRAILER
Author
Hyderabad, First Published Sep 28, 2019, 4:19 PM IST

పూజా గాంధీ, రఘు, ముఖర్జీ పాత్రదారులుగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై వెంకట్ దండుపాళ్యం చిత్రాన్ని నిర్మిస్తే మంచి విజయం సాధించిన సంగతి తెలింసిందే. ఈ చిత్రం ఇప్పటికే మూడు భాగాలుగా తెరకెక్కి నిర్మాతకు కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ చిత్రాలకు సీక్వెల్ గా దండుపాళ్యం నాలుగో భాగం తెలుగు కన్నడ బాషల్లో కూడా తెరకెక్కుతుంది.

కాగా.. వెంకట్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌, కీలక పాత్రధారులుగా దండుపాళ్యం నాలుగో భాగం తెర‌కెక్కుతుంది. కేటీ నాయక్ దర్శకత్వంలో రూపొందిన దండుపాళ్యం 4 ను నవంబర్ 1న విడుదల చేయాలని నిర్ణయించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.  గత చిత్రాలకు మించి మరింత హింసాత్మకంగాను, శృంగార భరితంగాను ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ఈ ట్రైలర్ చూస్తే అర్దమవుతోంది.  

నిర్మాత వెంకట్ మాట్లాడుతూ… తెలుగు, కన్నడ నాట ‘దండుపాళ్యం – 4 ‘ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయటం జరిగింది. ట్రైలర్ విడుదల అయిన కొద్ది సమయానికే చిత్రం పై  మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకోవడం, ట్రెండింగ్ అవటం, చిత్ర విజయం పై మా నమ్మకాన్ని మరింత పెంచింది. సినిమా బాగా వచ్చింది అన్నది చిన్నమాట. ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. నవంబర్ 1 న ‘దండుపాళ్యం – 4 ‘ చిత్రాన్ని తెలుగు, కన్నడ నాట అత్యధిక ధియేటర్ లలో విడుదల చెయ్యబోతున్నాము.

‘దండుపాళ్యం-4’లో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4’ ఉండబోతోంది. ఇందులో ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ చక్కగా నటించారు. కె.టి.నాయక్‌ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు’ అన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios