సినిమా షూటింగ్ అంటే ఒకరివల్ల ముందుకు సాగే పడవ కాదు. ఎంతో మంది కలిసి పనిచేస్తేనే ప్రయాణించే ఒక ఆశల ఓడ. అందుకే ఆ ప్రయాణంలో కోపతాపాలకు ఎక్కువ సమయం ఉండదు. ఏం చేసిన ఫైనల్ గా అవుట్ ఫుట్ బావుండాలి అని చెబుతున్నారు రత్నవేలు. ఇండియన్ టాప్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరైన రత్నవేలు రోబో - ఖైదీ నెంబర్ 150  రంగస్థలం వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాలకు వర్క్ చేశారు. 

ఇక నెక్స్ట్ ఆయన పని చేసిన హిస్టారికల్ ఫిల్మ్ సైరా నరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏడాదికి పైగా ఈ సినిమా కోసం సమయం కేటాయించిన రత్నవేలు కొన్నిసార్లు షూటింగ్ లో కోప్పడినట్లు ఓపెన్ గా చెప్పారు. గ్యాప్ లేకుండా షూటింగ్ చేయడంతో వర్క్ ప్రెజర్ అందరిలో ఉండిందని, అయితే ఈ సినిమా అవుట్ ఫుట్ కోసం కొన్నిసార్లు ఆగ్రహానికి లోనైట్లు చెప్పారు. 

ఖైదీ నెంబర్ 150 - రంగస్థలం సినిమాల ద్వారా రామ్ చరణ్ తో మంచి స్నేహం ఏర్పడిందని చెబుతూ చిత్ర యూనిట్ లో ఎవరు కూడా తనపై పెద్దగా ప్రెజర్ పెట్టలేదని రత్నవేలు తెలిపారు. కొణిదెల ప్రొడక్షన్ లో తెరకెక్కిన సైరా సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

మళ్ళీ రిస్క్ చేసిన యూవీ క్రియేషన్స్.. సైరాకు రికార్డ్ ధర!

సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక అదేనా.. చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ ?

నా కెరీర్ లో ది బెస్ట్ రోల్ 'సైరా'లో చేస్తున్నా.. పృథ్వి!

నీటి అడుగున 'సైరా'.. ఆ ఫైట్ లో ఊచకోతే!

చిరు గొప్ప నటుడని తెలుసు.. కానీ ఆరోజు ఆయన్ని అలా చూసి..హృతిక్!