కమెడియన్ పృథ్వి ఇటీవల వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ఏపీ సీఎం వైయస్ జగన్ పృథ్విని ఎస్వీ బిసి ఛానల్ కు చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే.చిత్ర పరిశ్రమలో ఎవరికీ వైయస్ జగన్ సీఎం కావడం ఇష్టం లేదని ఇటీవల పృథ్వి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. 

తాజాగా పృథ్వి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ కెరీర్ పై క్లారిటీ ఇచ్చాడు. తన సినీ కెరీర్ ముగియలేదని.. తాను ఇప్పటికి కొన్ని చిత్రాల్లో నటిస్తున్నాని పృథ్వి వివరించాడు. మెగాస్టార్ చిరంజీవి 'సైరా' చిత్రంలో తాను పోషించే పాత్ర తన కెరీర్ లోనే ది బెస్ట్ అని పృథ్వి వివరించాడు. ఎస్వీబిసి చైర్మన్ గా శ్రీవారి సేవ చేస్తూనే ఖాళీ సమయాన్ని నటనకు కేటాయిస్తానని పృథ్వి తెలిపాడు. 

తనకు పరిచయం ఉన్న దర్శక నిర్మాతలు, హీరోలతో టచ్ లో ఉంటాయి. పలానా రోజుల్లో ఖాళీగా ఉంటాను. నా ఏదైనా రోల్ ఇచ్చి వాడుకోవచ్చు అని చెప్పానని పృథ్వి తెలిపాడు. ఆ మధ్యన తాను జగన్ కి సపోర్ట్ చేస్తున్నానని కొందరు దర్శకులు సినిమా నుంచి తనని తొలగించినట్లు పృథ్వి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.