Asianet News TeluguAsianet News Telugu

క్రిస్టోఫర్‌ నోలన్ ‘టెనెట్‌’ రిలీజ్ డేట్ మారింది

క్రిస్టఫర్‌ తీసిన తాజా భారీ సినిమా ‘టెనెట్‌’  వాస్తవానికి జూలై 17న విడుదల ప్లాన్ చేసారు. లాక్‌డౌన్‌ తర్వాత కరోనాతో  పరిస్దితుల్లో  హాలీవుడ్‌ నుంచి ప్రపంచం మీదకు ప్రేక్షకుల రెస్పాన్స్  కోసం వదలనున్న సినిమా ఇదే. దాంతో ఈ సినిమా ప్రేక్షకులను రప్పించగలిగితే మిగిలిన సినిమాలన్నీ గాడిలో పడతాయని భావిస్తున్నారు. 

Christopher Nolan Tenet Pushed by Warner Bros
Author
Hyderabad, First Published Jun 14, 2020, 12:42 PM IST

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్‌ నోలన్‌ హాలీవుడ్‌ను కాపాడతాడని అందరూ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్దితుల్లో ఏ సినిమా రిలీజ్ చేసినా జనం థియోటర్ కు వెళ్లి చూసే పరిస్దితి లేదు. నోలన్ వంటి దర్శకుడు సినిమా అంటే కాస్త జనం గడపదాటి థియోటర్స్ లోకి వస్తారని  సమస్త హాలీవుడ్‌ భావిస్తోంది. క్రిస్టఫర్‌ తీసిన తాజా భారీ సినిమా ‘టెనెట్‌’  వాస్తవానికి జూలై 17న విడుదల ప్లాన్ చేసారు. లాక్‌డౌన్‌ తర్వాత కరోనాతో  పరిస్దితుల్లో  హాలీవుడ్‌ నుంచి ప్రపంచం మీదకు ప్రేక్షకుల రెస్పాన్స్  కోసం వదలనున్న సినిమా ఇదే. దాంతో ఈ సినిమా ప్రేక్షకులను రప్పించగలిగితే మిగిలిన సినిమాలన్నీ గాడిలో పడతాయని భావిస్తున్నారు. 

అయితే ఈ లోగా ట్విస్ట్ పడింది. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. లీడింగ్ హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వార్నర్ బ్రదర్శ్ వారు టెనెట్ రిలీజ్ ని రెండు వారాలు ముందుకు తోసారు. ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం జూలై 31 న రిలీజ్ చేయటానికి నిర్ణయించారు. ఎలాగైనా అనుకున్న తేదీ కే సినిమా విడుదల చేయాలని నోలన్‌ పట్టు పట్టి ఉన్నాడట. కాని కరోనా విజృంభణ, అమెరికాలో రాజకీయ పరిస్దితులు, ర్యాలీలు, ధర్నాలు వంటివి ఈ నిర్ణయానికి అడ్డుకట్ట వేసాయి. ఇక  ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి.  మూడో ప్రపంచ యుద్ధాన్ని ఓ సీక్రెట్‌ ఏజెంట్‌ ఎలా అడ్డుకున్నాడనేదే ‘టెనెట్‌’ కథ. మన డింపుల్‌ కపాడియా ఇందులో ముఖ్యపాత్ర పోషించింది. 

ఈ సినిమా తర్వాత బాండ్‌ ఫిల్మ్‌ ‘నో టైమ్‌ టు డై’ విడుదలవుతుంది. ఇక ఏప్రిల్‌ 10న థియేటర్లతోపాటు కరోనా వల్ల డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ మీద కూడా విడుదలైన ‘ట్రోల్స్‌ వరల్డ్‌ టూర్‌’ వివాదం రేపింది. థియేటర్ల కంటే డిజిటల్‌గా ఇది బాగా కలెక్ట్‌ చేయడంతో అమెరికాలోని థియేటర్స్‌ వ్యవస్థ భగ్గుమంది. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్‌ చేసిన యూనివర్సల్‌ స్టూడియో వారి ఏ సినిమాలనూ విడుదల చేయబోమని అల్టిమేటం జారి చేసింది. దాంతో ఆ స్టూడియో నుంచి రాబోతున్న ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 9’, ‘జూరాసిక్‌ వరల్డ్‌: డొమినియన్‌’ తదితర సినిమాల భవిష్యత్తు ప్రశ్నార్థకం గా మారాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios