Asianet News TeluguAsianet News Telugu

GodFather Teaser: మెగా ఫ్యాన్స్ కి క్రేజీ న్యూస్... గాడ్ ఫాదర్ టీజర్ డేట్ ప్రకటించిన టీమ్!


మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. బాస్ చిరంజీవి క్రేజీ అప్డేట్ తో వచ్చారు. ఆయన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ టీజర్ విడుదల తేదీ ప్రకటించారు. 

chiranjeevi latest movie teaser will be out on august 21
Author
First Published Aug 18, 2022, 1:22 PM IST


మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతుంది. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. గాడ్ ఫాదర్ టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆగస్టు 21న గాడ్ ఫాదర్ టీజర్ విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేశారు. 

గాడ్ ఫాదర్ చిత్రం దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ఆలోచన. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ నెలలో టీజర్(Godfather Teaser) వచ్చే నెలలో ట్రైలర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి లుక్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. ఈ క్రమంలో మూవీపై అంచనాలు పెరిగాయి. బాలీవుడ్ స్టార్ హారో సల్మాన్ ఖాన్ ఈ మూవీలో స్పెషల్ రోల్ చేయడం విశేషం. చిరంజీవి, సల్మాన్ కాంబినేషన్ లో ఓ సాంగ్ కూడా తెరకెక్కించారు. 

అలాగే నయనతార ఓ పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఆచార్య మూవీ చిరంజీవికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో ఆయన సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. గాడ్ ఫాదర్ విడుదలకు సిద్ధం అవుతుండగా భోళా శంకర్, మెగా 154 చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. వచ్చే ఏడాది చిరంజీవి నుండి మరో రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. మెగా 154 మూవీలో రవితేజ కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios