ప్రముఖ సినీ రచయిత, నిర్మాత, దర్శకుడు కోన వెంకట్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. సినిమాకు కథ ఇస్తానని డబ్బులు తీసుకుని , కథ ఇవ్వకుండా మోసం చేసారంటూ కేసు పెట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 78లోని జెమిని ఎఫ్‌ఎక్స్‌ సంస్థకు కొత్త సినిమా కోసం కథ రాసిస్తానని 2017 మే నెలలో కోన వెంకట్‌ రూ.13.5 లక్షలు అడ్వాన్స్‌ తీసుకున్నారు. రెండేండ్లుగా కథ ఇవ్వకపోగా, ఎక్కువ కాలం అమెరికాలో ఎక్కువగా గడుపుతున్నారు. కథ ఇవ్వలేకపోతే, అడ్వాన్‌ డబ్బు తిరిగివ్వాలని కోరినా లెక్క చేయకపోవడంతో ఆ సంస్థ ప్రతినిధి ఆర్‌వీ ప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.

అంతేకాకుండా డబ్బులు అడిగితే బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రసాద్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కోన వెంకట్‌పై 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.