Asianet News TeluguAsianet News Telugu

Allu Aravind: మెగా హీరోతో కార్తికేయ 2 డైరెక్టర్.. అల్లు అరవింద్ ఫిక్స్ అయ్యారా ?

కార్తికేయ 2 ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. కార్తికేయ 2 చిత్రాన్ని చందు ముండేటి తెరకెక్కించిన విధానం అద్భుతం. శ్రీకృష్ణుడి నేపథ్యంలో సాగే అడ్వెంచర్ జర్నీగా కార్తికేయ 2 ప్రేక్షకులని మెప్పిస్తోంది. 

Chandu Mundeti to direct Varun Tej
Author
First Published Aug 16, 2022, 10:52 AM IST

టాలీవుడ్ నిర్మాతలు ప్రస్తుతం యువ దర్శకుడు చందు ముండేటి వెంట పడుతున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ 2 ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. కార్తికేయ 2 చిత్రాన్ని చందు ముండేటి తెరకెక్కించిన విధానం అద్భుతం. శ్రీకృష్ణుడి నేపథ్యంలో సాగే అడ్వెంచర్ జర్నీగా కార్తికేయ 2 ప్రేక్షకులని మెప్పిస్తోంది. 

హిట్ పడ్డప్పుడు సహజంగానే నిర్మాతలు ఆ దర్శకుడి వెంట పడతారు. అడ్వాన్సులు ఇచ్చి బుక్ చేసుకుంటారు. తాజాగా నిర్మాత అల్లు అరవింద్.. చందు ముండేటితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చందు ముండేటి తదుపరి చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో దాదాపుగా ఖరారైనట్లే తెలుస్తోంది. 

వరుణ్ తేజ్ తో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన గని చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. తమ సంస్థ వల్ల తప్పు జరిగింది కాబట్టి.. వరుణ్ తేజ్ తానే హిట్ ఇవ్వాలని అరవింద్ డిసైడ్ అయ్యారట. వరుణ్ తేజ్ సినిమా చేసేందుకు కథ రెడీ చేయమని చందు ముండేటిని అల్లు అరవింద్ కోరినట్లు తెలుస్తోంది. 

చందు ముండేటి కూడా తొందర పడకుండా కార్తికేయ 2 ఇచ్చిన విజయాన్ని కొనసాగించే పనిలో ఉన్నారు. మంచి కథతోనే ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. వరుణ్ తేజ్ తదుపరి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించాల్సి ఉంది. కార్తికేయ 2 దర్శకుడితో మూవీ కూడా కంఫర్మ్ అయితే.. మెగా హీరో ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్లే. 

Follow Us:
Download App:
  • android
  • ios