Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ కేసులో క్రిసాన్ పెరీరా ను ఇరికించిన శత్రువులు.. షార్జా జైలు నుంచి బాలీవుడ్ నటి రిలీజ్

డ్రక్స్ కేసులో అన్యాయంగా ఇరుక్కుంది బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా. రీసెంట్ గా తను నేరం చేయలేదని నిరూపణ అవ్వడంతో షార్జా జైల్ నుంచి రిలీజ్ అయ్యింది. 

Bollywood actress In drugs Case chrisann pereira released from sharjah jail JMS
Author
First Published Apr 27, 2023, 10:18 AM IST

ఈ మధ్య డ్రక్స్  అక్రమ రవాణా కేసులో అరెస్ట్  అయ్యింది  బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా. అది కూడా దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ఆమెను అరెస్ట్ చేశారు. ఇక తాజాగా యూఏఈలోని షార్జా జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. ఆమె దగ్గర ఉన్న  ట్రోఫీలో డ్రగ్స్‌ను గుర్తించిన షార్జా పోలీసులు ఈ నెల మొదట్లో అరెస్ట్ చేసి జైలుకు పంపారు.  అయితే అవి తనదగ్గరకు ఎలా వచ్చాయో తెలియదని ఆమె చెప్పగా.. విచారణ చేసిన అధికారులు నిజ నిర్ధారణ చేసి.. ఆమెను నిర్ధోషిగా తేల్చారు..

27 ఏళ్ల పెరీరా  బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసింది. సడక్ 2,బాట్లా హౌస్ లాంటి సినిమాల్లో నటించారు. అయతే ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటి క్రిసాన్ పెరీరాను ఇద్దరు వ్యాక్తులు ఇరికించినట్టు గుర్తించారు. ఆ ఇద్దరు నిందితులను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెరీరాను కావాలని ఇరికించి.. ఆమెను  జైలుకు పంపాలన్న  ఉద్దేశంతోనే వారు ఇలా చేసినట్టు విచారణలో తేలింది.దాని కోసం వారు ఆమె తీసుకెళ్తున్న ట్రోఫీలో డ్రగ్స్ పెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

అయితే బాలీవుడ్ నటిని ఇరికించిన వారిలో ఒక నిందితుల్లో ఒకరిని ముంబైలోని బొరివలీకి చెందిన ఆంథోనీ పాల్‌గా గుర్తించగా, మరొకరిని మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌కు చెందిన రాజేశ్ బాభోటే అలియాస్ రవిగా గుర్తించారు.  క్రిసాన్‌ను కావాలనే ఇలా ఇరికించారని ఆమె ఫ్యామిలీ ఆరోపించారు. వీరు కూడా పోలీసు కేసు పెట్టడంతో.. విచారణను వేగం చేశారు. ఈ కుట్ర వెనుకు ఉన్నది మహరాష్ట్రాకు చెదిన ఆథోనీపాల్ గా గుర్తించారు. అయితే క్రిసాన్ పై కోపంతో వారు ఇది చేయలేదని.. ఆమె తల్లి.. ప్రేమిలా మీద ఉన్న పగతో... ఆమె కూతురు బాలీవుడ్ నటి.. క్రిసాన్ పెరీరా పై ఈ అఘాయిత్యానికి వారు పాలుపడినట్టుతెలుస్తోంది. 

అందులో భాగంగా ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్‌ కోసం యూఏఈలో ఆడిషన్స్ జరుగుతున్నాయంటూ ఆంథోనీ, రవి కుట్రపూరితంగా ఆమెను అక్కడికి పంపారు. విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత డ్రగ్స్‌తో నింపిన ట్రోఫీని ఆమెకు అందించారు. అంతేకాదు, పాల్ ఇలాగే మరో నలుగురిని కూడా ఇరికించినట్టు ముంబై పోలీసులు గుర్తించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios