టీవీ9 నుంచి బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి బయిటకు వచ్చి సాక్షి ఛానెల్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఛానెల్ నుంచి బయిటకు రావటానికి కారణం...ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి ఫొటోని వాడినందుకు, తండ్రి గురించి గొప్పగా చెప్పినందుకు మేనేజ్ మెంట్ కు కోపం రావడం వల్లనే బిత్తిరి సత్తి ఆ ఛానెల్ నుంచి బయటకొచ్చేశాడని వార్తలు వచ్చాయి. నమ్మినోళ్లు నమ్మారు.

లేనోళ్లు...వేరే రకంగా కామెంట్స్ చేసారు. ఇచ్చే డబ్బులు సరిపోవటం లేదని...ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తూ...సత్తే రాజీనామా చేశాడని, కాదు.. బిగ్‌బాస్‌ షోలో పాల్గొనేందుకు రాజీనామా చేశాడని.. రకరకాలుగా అప్పటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటికి తెరదించుతూ సత్తి సాక్షి ఛానెల్ సాక్షిగా ప్రోమో వదిలాడు.  మొదలే ...టీవి 9 ఛానెల్ పై బిత్తిరి సత్తి సెటైర్ వేస్తూ ఎంట్రీ ఇచ్చాడు.  సాక్షి ఛానెల్ లో తన మొదటి ఎపిసోడ్ నే టీవీ9పై సెటైర్స్ లకు వాడుకున్నాడు.

 ఫాదర్స్ డే రోజు చేసిన షో వల్ల తను టీవీ9 నుంచి బయటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అదే ఫాదర్ కాన్సెప్ట్ తీసుకొని ప్రోమో రెడీ చేశాడు సత్తి. తండ్రిని గౌరవించే ఛానెల్ కు వచ్చానని డైరక్ట్ గా చెప్పిన సత్తి.. ఇకపై ఇంక ఏ ఛానెల్ కు పోవాల్సిన అవసరం లేదన్నారు. మీరు ఇక్కడ ఆ ఛానెల్ ప్రోమో చూడచ్చు.

https://www.youtube.com/watch?v=yV6zksn4dJs
  
  ఇక ఇప్పటి వరకు వీ6 న్యూస్‌, టీవీ9లలో స‌త్తి రెండు భిన్న గెటప్‌లలో అలరించాడు. కానీ సాక్షిలో మరో కొత్త గెటప్ లో దర్శనమివ్వనున్నట్లు తెలిసింది.