Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ కు బింబిసార, పక్కా ప్లాన్ తో వెళ్తోన్న కల్యాణ్ రామ్

చాలా కాలం తరువాత బింబిసార సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు హీరో కల్యాణ్ రామ్. ఇక  ఈ సినిమా విషయంలో మరో అడుగు ముందు వేయబోతున్నాడు నందమూరి హీరో.  

Bimbisara movie Releasing On Bollywood
Author
Hyderabad, First Published Aug 18, 2022, 2:06 PM IST

కల్యాణ్ రామ్  హీరోగా స్వీయ నిర్మానంలో తెరకెక్కిన సినిమా బింబిసార. యంగ్ స్టార్.. కొత్త డైరెక్టర్  వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన రోజునే సూపర్ సక్సెస్  హిట్ టాక్ తెచ్చుకుంది. కల్యాణ్ రామ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. మూడు డిఫరెంట్ లుక్స్ తో కల్యాణ్ రామ్ కనిపించిన ఈ మూవీలో హీరోయిన్లు గా  సంయుక్తా మీనన్ తో పాటు కేథరిన్ థెరిస్సాల కలిసి నటించి మెప్పించారు. 

మొదటి నుంచిఈ సినిమాపై పక్కా కాన్ఫీడెంట్ గానే ఉన్నాడు కల్యాణ్ రామ్. అంతే కాదు ఎన్టీఆర్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా సక్సెస్ పై నమ్మకం వ్యక్తం చేశాడు. ఈ సినిమా చూసిన స్టార్ సెలబ్రిటీలంతా మంత్రముగ్థులు అవుతున్నారు. ఇక రీసెంట్ గా బాలయ్య కోసం ఈ సినిమా ప్రత్యేక పదర్శన వేయగా.. నందమూరి కుటుంబంతో సినిమా చూసి బాలయ్య సంతోషం వ్యాక్తం చేశారు. 

అంతకు ముందు తమిళ స్టార్ హీరో విజయ్ కూడా.. హైదరాబాద్ లో షూటింగ్ నిమిత్తంవచ్చి.. షెడ్యూల్ గ్యాప్ లో మహేష్ బాబుకు సంబంధించిన ఏఏమ్బీమాల్ లో సీక్రేట్ గా సినిమా చూసి వచ్చారు. ఇక ఈమూవీ విషయంలో దిల్ ఖుష్ గా ఉన్న కల్యాణ్ రామ్.. మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు. 

అయితే ఇప్పటి వరకూ బింబిసారను తెలుగులో మాత్రమే విడుదల చేశారు. తెలుగులో వచ్చే రెస్పాన్స్ ను బట్టి ప్లాన్ బీని  రెడీ చేసుకోవాలిఅనున్నారు టీమ్. ఈ విషయాన్ని ప్రమోషన్స్ సమయంలో కల్యాణ్ రామ్ చెప్పాడు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తే.. మిగతా భాషల్లో రిలీజ్ చేస్తామన్నారు ఆయన. ఇక అనుకున్నట్టుగానే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలను సొంతం చేసుకుంది.

ఇక అనుకున్నట్టుగానే  కల్యాణ్ రామ్  ఇతర భాషల్లోను ఈ సినిమాను రిలీజ్  చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన నిఖిల్ కార్తికేయ2 సినిమా హిందీలో  భారీ వసూళ్లను రాబడుతూ ఉండటంతో , బింబిసార ను కూడా ముందుగా హిందీలో రిలీజ్ చేసే ఆలోచనలో ఆయన ఉన్నాడని అంటున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios