బిగ్ బాస్ సీజన్ 2 లో గత కొద్దిరోజులుగా గీతామాధురి, కౌశల్ మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. మర్డర్ టాస్క్ లో వచ్చిన పవర్ ని వినియోగిస్తూ గీతామాధురి సీజన్ మొత్తం కౌశల్ ని ఎలిమినేషన్స్ కి నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుండి వీరిద్దరి మధ్య సఖ్యత చెడింది. చీటికిమాటికి ఇద్దరి మధ్య ఏదొక గొడవ జరుగుతూనే ఉంది. శుక్రవారం ఎపిసోడ్ లో 'టికెట్ టు ఫీనాలే' టాస్క్ లో భాగంగా గీతామాధురి కారులో ఉంది.

కౌశల్ సంచాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే గీతా కారులో పడుకోవడంతో ఆమె రూల్స్ కి విరుద్ధంగా ప్రవర్తించినందుకు కౌశల్ ఆమెను కారు నుండి బయటకి వచ్చేయమని కోరారు. మొదట దీన్ని వ్యతిరేకించిన గీతా ఆ తరువాత బయటకి వచ్చేసింది. అలా గీతా బయటకి వచ్చిన తరువాత కౌశల్, గీతాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటల మధ్యలో కౌశల్ తనను సీజన్ మొత్తం నామినేట్ చేసినందుకు గీతాపై విరుచుకుపడ్డారు. 

మరోసారి జనాల్లో తనను బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారంటూ కౌశల్ పై కామెంట్స్ చేసి మీ మీద నాకున్న ఇంప్రెషన్ మొత్తం మారిపోయిందని చెప్పింది. దీనికి కౌశల్ 'మీ ఇంప్రెషన్ ఎవడికి కావాలి..? ఏరోజైతే సీజన్ మొత్తం నన్ను నామినేట్ చేశారో అప్పుడే మీ మీద నాకు ఇంప్రెషన్ పోయిందని' కామెంట్స్ చేశారు.