బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే 12 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ వారంలో హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ 'టికెట్ టు ఫినాలే' టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో శ్యామల, దీప్తి, తనీష్, సామ్రట్, గీతా మాధురి, తనీష్‌‌లు కారులో పోటీ పడి ఎక్కేశారు. ఈ టాస్క్ ప్రారంభంలోనే సంచాలకుడిగా ఉన్న కౌశల్.. ఎవరైనా గేమ్ రూల్స్ తప్పితే పక్కకు తప్పుకోవాలంటూ హుకుం జారీ చేశారు.

కారులో గీతా పడుకుందనే కారణంతో ఆమెను కారు నుండి బయటకి రమ్మని కౌశల్ సూచించాడు. ఆ తరువాత తనీష్, సామ్రాట్ లు తమలో ఎవరో ఒకరు కారులో ఉండాలనే  ఆలోచనతో దీప్తి, శ్యామలపై బల ప్రయోగం చేశారు. ఈ క్రమంలో దీప్తి జుట్టు నేలకి తాకింది. దాన్ని కౌశల్ కన్సిడర్ చేయకుండా.. ఆమెపై బలప్రయోగం చేస్తోన్న తనీష్ తో ఆమె కాలు నేలపై పెట్టలేదని కాబట్టి ఆమె కారులోనే ఉండొచ్చని అన్నారు.

దీంతో ఫైర్ అయిన తనీష్ ఇది బిగ్ బాస్ రూలా..? లేక మీ రూలా..? అని అడగగా.. కౌశల్ దానికి సమాధానంగా సంచాలకుడిగా టాస్క్ విషయంలో నేను సొంత నియమాలు పెట్టొచ్చని అన్నాడు. దీంతో అతడిపై అసహనం వ్యక్తం చేసిన తనీష్ శనివారం ఎపిసోడ్ లో ఈ రూల్స్ గురించి మాట్లాడుకుందాం అంటూ హెచ్చరించినట్లుగా కామెంట్స్ చేశాడు. ఇక టికెట్ టు ఫినాలే టాస్క్ లో బజర్ మోగే సమయానికి ముగ్గురు కంటెస్టెంట్స్ కారులో ఉండడంతో ఎవరికి టికెట్ టు ఫినాలే అవకాశం లభించలేదు. 

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: మీ ఇంప్రెషన్ ఎవడికి కావాలి..? గీతాపై కౌశల్ ఫైర్!

బిగ్ బాస్2: కౌశల్.. కావాలని కెలుక్కోకు.. గీతామాధురి వార్నింగ్!