బిగ్ బాస్ సీజన్ 2లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న కౌశల్ ని సీజన్ మొత్తం నామినేట్ చేసింది గీతామాధురి. అలా గీతా ఎప్పుడైతే చేసిందో కౌశల్ కి ఆమె పట్ల ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. దానికి తగ్గట్లే ఆమెతో ప్రవర్తిస్తున్నాడు. వీరిద్దరూ తరచూ ఒకరినొకరు విమర్శించుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో తనీష్-కౌశల్ కి మధ్య గొడవలు హద్దులు మీరుతున్నాయి.

నిన్నటికి నిన్న హౌస్ లో నామినేషన్ ప్రక్రియలో కౌశల్.. తనీష్ తో గొడవ పడ్డాడు. నిజానికి తనీష్.. దీప్తిని నామినేట్ చేస్తూ ఆమెకు ఏదో వివరణ ఇస్తుంటే మధ్యలో కౌశల్ కల్పించుకొని మాట్లాడడంతో నానా గొడవ జరిగింది. నిజానికి అక్కడ కౌశల్ కావాలనే గొడవ పడ్డాడనే కామెంట్స్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. అసలు అక్కడ తనీష్,, కౌశల్ ని నామినేట్ చేయడం లేదు కానీ ఏదోరకంగా తనీష్ కి కోపం తెప్పించాలనే ప్రయత్నంలో కౌశల్ ఆ విధంగా ప్రవర్తించాడని అంటున్నారు.

తనను మినహాయించుకొని మిగిలిన హౌస్ మేట్స్ లో తనీష్ ఒక్కడికే ఆడడం తెలుసని గతంలో కౌశల్ స్వయంగా నూతన్ తో చర్చించాడు. తనకు కాంపిటీటర్ గా భావిస్తోన్న తనీష్ ని బ్యాడ్ చేయాలనే స్ట్రాటజీలో భాగంగా కౌశల్ అతడితో గొడవ పడినట్లు తనీష్ అభిమానులు ఆరోపిస్తున్నారు. తనీష్ కి షార్ట్ టెంపర్ అనే విషయం కౌశల్ కి బాగా తెలుసు.. దాన్ని ఉపయోగించుకొని ప్రజల్లో అతడిని బ్యాడ్ చేయాలనే నిన్న కావాలని గొడవ పెట్టుకున్నట్లు తనీష్ ఫ్యాన్స్ కౌశల్ పై కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు కౌశల్ నామినేషన్స్ లో ఉన్నాడనే భయంతో ఇలా చేస్తున్నాడని అంటున్నారు. మరి ఈ విషయాలు కౌశల్ ఆర్మీ వింటే ఎలా స్పందిస్తుందో చూడాలి!

ఇవి కూడా చదవండి..

బిగ్ బాస్2: మరోసారి కౌశల్, తనీష్ ల మధ్య రచ్చ!

బిగ్ బాస్2: తనీష్ ఆర్మీ 5కె రన్..

బిగ్ బాస్2: ఫినాలే గెస్ట్ ఎవరో తెలుసా..?