బిగ్ బాస్2: ఫినాలే గెస్ట్ ఎవరో తెలుసా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 10, Sep 2018, 4:15 PM IST
nagarjuna to attend bigg boss grand finale
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 ముగింపు దశకి చేరుకుంది. మరికొద్ది రోజుల్లో ఈ షో ఫైనల్స్ కి చేరుకోనుంది. బిగ్ బాస్ సీజన్ 1 లో ముగ్గరు ఫైనలిస్ట్ లను అనౌన్స్ చేసి ఒకరికి టైటిల్ అందించారు. ఈసారి ఐదుగురు కంటెస్టెంట్లను ఫైనలిస్టులుగా ఎంపిక చేయనున్నారు. 

వారిలో ఒకరికి బిగ్ బాస్ టైటిల్ దక్కనుంది. అయితే ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి సినిమా ఇండస్ట్రీ నుండి ఒకరిని అతిథిగా తీసుకురావాలనేది ప్లాన్. అందులో నాగార్జున పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ షో హోస్ట్ చేస్తోన్న నాని.. నాగార్జునతో కలిసి 'దేవదాస్' అనే సినిమాల నటించారు. నాగార్జున గతంలో మాటీవీలో ఓ షో కూడా చేశారు. ఆ సంస్థతో నాగార్జునకు మంచి బంధం ఉంది.

దీంతో ఇప్పుడు నాగార్జునని ఫినాలే కోసం అతిథిగా ఆహ్వానించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయనప్పటికీ ఆహ్వానం వస్తే మాత్రం నాగార్జున కచ్చితంగా వస్తారనే నమ్మకం నిర్వాహకుల్లో ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. నాగార్జున రాకతో ఫైనల్ ఎపిసోడ్ మరింతగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి..

కౌశల్ కెరీర్ గ్రాఫ్ మారబోతుందా..?

బిగ్ బాస్2: కౌశల్ కి టైటిల్ రాకపోతే..?

బిగ్ బాస్2: శ్యామల అవుట్.. టాప్ త్రీలో ఆ ముగ్గురే!

loader