బిగ్ బాస్ సీజన్ 2 కి ప్రేక్షకాదరణ దక్కుతోంది. సీజన్ 1కి రానంత క్రేజ్, పాపులారిటీ సీజన్ 2 కి లభించింది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం సోషల్ మీడియాలో ఆర్మీలు పుట్టుకొచ్చాయి.

బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతోన్న కౌశల్ కోసం కౌశల్ ఆర్మీ పుట్టుకొచ్చింది. అయితే ఇది పెయిడ్ ఆర్మీ అంటూ కామెంట్స్ వినిపించడంతో తమ పవర్ నిరూపించడానికి అన్నట్లుగా నిన్న హైదరాబాద్ లో కౌశల్ ఆర్మీ 2కె రన్ నిర్వహించింది. దీనికి ప్రజల నుండి వచ్చిన భారీ స్పందన చూసి బిగ్ బాస్ నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోయారు.

ఇప్పుడు తనీష్ ఆర్మీ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతుంది. వారు ఏకంగా 5కె రన్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఆదివారం వైజాగ్ లో ఆర్కే బీచ్ రోడ్ లో ఉదయం 6 గంటల నుండి ఈ 5కె రన్ జరగనుందట. దానికి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిన్నేమో కౌశల్ ఆర్మీ, ఇప్పుడు తనీష్ ఆర్మీ రేపు గీతా ఆర్మీ అంటూ మరో పోస్టర్ బయటకి వచ్చినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు.