బిగ్ బాస్ సీజన్ 2 లో వార్ మొదలైంది. షో పూర్తి కావడానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో హౌస్ మేట్స్ మధ్య పోటీ వాతావరణం నెలకొంది. శ్యామల ఎలిమినేట్ అయిన తరువాత షోలో ఏడుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ కోసం జరిగిన ప్రక్రియ హౌస్ లో హీట్ ని పెంచేసింది. కౌశల్ ని సీజన్ మొత్తం నామినేట్ చేసిన కారణంగా ఆయన్ను తప్పించి మిగిలిన హౌస్ మేట్స్ ఒక్కొక్కరు కారణాలు చెప్పి ఇద్దరినీ నామినేట్ చేయాలి.

ఈ ప్రాసెస్ లో తనీష్.. దీప్తిని నామినేట్ చేస్తూ కార్ టాస్క్ కారణంగా చెబుతూ ఆమెకు వివరణ ఇస్తుండగా.. మధ్యలో కౌశల్ కల్పించుకొని.. ''రన్నింగ్ టాస్క్ లో దీప్తి సునైనా కోసం త్యాగం చేసిన మీరు.. దీప్తి నల్లమోతుని అమ్మా అమ్మా అంటూ ఆమెను ఎందుకు కిందా మీదా పడేసి గెలవడానికి ప్రయత్నించారు. దీప్తి కోసం ఎందుకు త్యాగం చేయలేకపోయారు. మీరు వేరే రిలేషన్స్ కి ఇచ్చే విలువ అమ్మ రిలేషన్ కి ఎందుకు ఇవ్వలేకపోయారు. ఇక దీప్తిని అమ్మ అనకుండా అక్క అనే రిలేషన్ తో పిలిస్తే చూసే వాళ్లకు కూడా బాగుంటుంది'' అంటూ సలహా కూడా ఇచ్చారు.

ఈ ప్రశ్న తనీష్ కి ఆగ్రహాన్ని తెప్పించింది. దానికి సమాధానంగా.. 'నాకు ఏ రిలేషన్ అయినా ఒకటే.. అక్క, అమ్మ రిలేషన్స్ లో మీకు తేడా ఉందేమో నాకు మాత్రం లేదు. మీరు రిలేషన్స్ గురించి మాట్లాడవద్దు. సునైనాతో నాకు ఉన్న రిలేషన్ ఏంటో హౌస్ లో అందరికీ తెలుసు. మనిషికి మనిషికి మధ్య బాండింగ్ ఉంటుంది అందరూ మీలా ఉండలేరు'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ ఇష్యూ తన కారణంగా జరుగుతుందని దీప్తి మధ్యలో కల్పించుకొని.. తనీష్ నన్ను అమ్మా అని పిలవడం నాకు అది గొప్ప ఫీలింగ్ అని టాస్క్ విషయంలో తను ఎఫర్ట్స్ పెట్టలేదని అనడం కరెక్ట్ కాదని అన్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్స్ లో కౌశల్ తో పాటు దీప్తి, గీతా మాధురి, రోల్ రైడా, అమిత్ పేర్లు ఉన్నాయి. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి!
 

ఇవి కూడా చదవండి..

బిగ్ బాస్2: తనీష్ ఆర్మీ 5కె రన్..

బిగ్ బాస్2: ఫినాలే గెస్ట్ ఎవరో తెలుసా..?

కౌశల్ కెరీర్ గ్రాఫ్ మారబోతుందా..?

బిగ్ బాస్2: కౌశల్ కి టైటిల్ రాకపోతే..?

బిగ్ బాస్2: శ్యామల అవుట్.. టాప్ త్రీలో ఆ ముగ్గురే!