బిగ్ బాస్2: నూతన్ ఎంట్రీ.. ఇక షో ఆపేయమంటున్న ఆడియన్స్!

First Published 25, Aug 2018, 10:53 AM IST
bigg boss2: negative comments on show
Highlights

బిగ్ బాస్ సీజన్ 1 కంటే సీజన్ 2 లో కాస్త మసాలా ఎక్కువైందనే చెప్పాలి.  ఒక్క పెళ్లి టాస్క్ మినహాయిస్తే.. మిగిలిన షో మొత్తం ఆసక్తికరంగానే సాగింది. ఆడియన్స్ కు ఈ షోపై ఆసక్తి కనబరుస్తున్నారు

బిగ్ బాస్ సీజన్ 1 కంటే సీజన్ 2 లో కాస్త మసాలా ఎక్కువైందనే చెప్పాలి.  ఒక్క పెళ్లి టాస్క్ మినహాయిస్తే.. మిగిలిన షో మొత్తం ఆసక్తికరంగానే సాగింది. ఆడియన్స్ కు ఈ షోపై ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటిది  ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ షో ఆపేయమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దానికి కారణం నూతన్ నాయుడు ఎంట్రీ అని తెలుస్తోంది. షో మొదలైన రెండు వారాలకే బయటకి వెళ్లిపోయిన నూతన్ నాయుడు ప్రజల ఓట్లతో మరోసారి హౌస్ లోకి వచ్చారు.

అక్కడ వరకు  బాగానే ఉంది. కానీ ఆయన షోల్డర్ డిస్లొకేట్ అయిన కారణంగా హౌస్ నుండి మరోసారి బయటకి వెళ్లాల్సిన పరిస్థితి కలిగింది. ఆయన వెళ్లిపోయిన సమయంలో హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా బాధ పడ్డారు. కానీ ఊహించని విధంగా నిన్నటి ఎపిసోడ్ లో ఆయన మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయంపై హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ కూడా పెదవి విరిచారు.

అలా బయటకి వెళుతూ మళ్లీ రావడానికి ఇది అసలు బిగ్ బాస్ హౌసేనా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. నూతన్ ఎంట్రీపై తనీష్  చేసిన వ్యాఖ్యలు సరైనవంటూ అతడికి మద్దతు తెలుపుతున్నారు. ఇక ఈ షో ఆపేస్తే బెటర్ అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. మరోసారి నూతన్ ని హౌస్ లోకి రప్పించి బిగ్ బాస్ యాజమాన్యం తప్పు చేసిందనే అభిప్రాయలు కలుగుతున్నాయి. 

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: నూతన్ రాక హౌస్ లో హాట్ టాపిక్ 

బిగ్ బాస్2: గీతాతో సామ్రాట్ ముద్దు.. గీత భర్తను అప్సెట్ చేస్తోందా..?

బిగ్ బాస్2: నూతన్ నాయుడు మళ్లీ వస్తున్నాడట!

loader