బిగ్ బాస్ సీజన్ 2 లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు రెండు వారాలకే హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయాడు. జనాల ఓట్లతో మరోసారి హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. కానీ అది కూడా ఎక్కువ రోజులు ఉండడం కుదరలేదు. గతవారం కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సమయంలో తన స్నేహితుడు కౌశల్ ని సపోర్ట్ చేయడం కోసం రోల్ రైడా పిరమిడ్ పై బంతులు విసిరాడు నూతన్.

ఈ క్రమంలో అతడి షోల్డర్ డిస్లొకేట్ అయింది. భుజానికి తగిలిన గాయం కారణంగా అతడు హౌస్ నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది. ట్రీట్మెంట్ కోసం అతడిని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. బిగ్ బాస్ నిర్వాహకులకు మరొక ఆప్షన్ లేక అతడిని బయటకి పంపాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి నూతన్ హౌస్ లోకి వెళ్లబోతున్నట్లు సమాచారం. ఈ వారంలోనే నూతన్ ఎంట్రీ ఉంటుందని చెబుతున్నారు.

నాని కూడా ఓ సందర్భంలో నూతన్ ఎలిమినేట్ అవ్వలేదని, అనివార్య కారణాల వలన అతడు హౌస్ నుండి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. దీంతో నూతన్ ఎంట్రీ ఖాయమని అంటున్నారు. ఇలా బయటకి వెళ్లి మళ్లీ తిరిగి హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్ ల పట్ల హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనీష్ నామినేషన్స్ లో కూడా ఇదే కారణం చెప్పి శ్యామలను నామినేట్ చేశాడు. మరి మరోసారి నూతన్ ఎంట్రీ ఇస్తే.. హౌస్ మేట్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో.. చూడాలి!