బిగ్ బాస్2: నూతన్ రాక హౌస్ లో హాట్ టాపిక్

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 24, Aug 2018, 11:51 PM IST
bigg boss2: Nutan Naidu is Back - Housemates in Shock
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 నేటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికొస్తే.. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో కౌశల్, దీప్తిలు పోటీ పడగా.. హౌస్ మేట్స్ సపోర్ట్ తో దీప్తి కెప్టెన్ గా నిలిచింది. ఇక హౌస్ లోకి నూతన్ నాయుడు మరోసారి ఎంట్రీ ఇవ్వడం హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చింది. 

బిగ్ బాస్ సీజన్ 2 నేటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికొస్తే.. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో కౌశల్, దీప్తిలు పోటీ పడగా.. హౌస్ మేట్స్ సపోర్ట్ తో దీప్తి కెప్టెన్ గా నిలిచింది.

ఇక హౌస్ లోకి నూతన్ నాయుడు మరోసారి ఎంట్రీ ఇవ్వడం హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చింది. గతవారం టాస్క్ లో కౌశల్ కి సపోర్ట్ చేస్తూ షోల్డర్ డిస్లోకేట్ కావడంతో హౌస్ నుండి నూతన్ బయటకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

సర్‌ప్రైజ్‌గా ఈరోజు మళ్లీ హౌస్ లోకి ప్రవేశించాడు. అతడి తిరిగి హౌస్ లోకి రావడం పట్ల హౌస్ మేట్స్ అసహనం వ్యక్తం చేశారు. బయటకి వెళ్లిన అతడిని మరోసారి ఎలా తీసుకొస్తారంటూ తనీష్ మిగిలిన హౌస్ మేట్స్ తో చర్చించాడు. అదే సమయంలో నూతన్ కూడా రావడంతో నేరుగా అతడితోనే ఈ విషయంపై చర్చించాడు.

ట్రీట్మెంట్ కోసం బయటకి వెళ్లి గత వారం ఎలిమినేషన్ తో పాటు ఈ వారం నామినేషన్స్ నుండి తప్పించుకున్నారని తనీష్ మండిపడ్డాడు. ఒకవేళ నూతన్ ఈ వారం నామినేషన్స్ లో పాల్గొని ఉంటే లెక్కలు మారేవేమో.. అంటూ వెల్లడించాడు. రోల్ కూడా తనీష్ మాటలతో ఏకీభవించాడు. మరి నూతన్ రాక ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి!

loader