బిగ్ బాస్ సీజన్ 2 ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. నాని డిఫరెంట్ గా హెల్మెట్ తో దర్శనమిచ్చారు. రాఖీ పండుగ విశిష్టతను తెలియజేస్తూ.. 'సిస్టర్ ఫర్ చేంజ్' ఎవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా రాఖీతో పాటు తమ సోదరులకు హెల్మెట్ కూడా అందించాల్సిందిగా కోరారు. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ విషయానికొస్తే.. ఈ మధ్యకాలంలో ఏ ఎపిసోడ్ ఈవిధంగా సాగలేదనే చెప్పాలి.

ఈ వారం హౌస్ లో కెప్టెన్ గా నిలిచిన దీప్తి నల్లమోతు హౌస్ లో రూల్స్ పాటించడం లేదని కెప్టెన్ పదవి నుండి తొలగిస్తున్నట్లు బిగ్ బాస్ తెలియజేశారు. ఈ వారానికి బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ గా ఎవరూ ఉండరంటూ దీప్తికి షాక్ ఇచ్చారు. తను చేసింది చిన్న తప్పేనని దానికి కెప్టెన్ నుండి తొలగించడం కరెక్ట్ కాదని దీప్తి ప్రాధేయపడినా వర్కవుట్ కాలేదు. ఇక హౌస్ లో పడుకోవడాలు, మైక్ లు ధరించకపోవడం చేయొద్దంటూ కౌశల్ చెప్పడంతో తనీష్ అతడిపై ఫైర్ అయ్యాడు. అసలు ప్రతిదానికి అలా చేయాలి. ఇలా చేయాలి అని చెప్పడానికి అసలు నువ్ ఎవరివి? అందరూ నీలాగే ఉండాలంటే కుదరదు. 

ఎవరైనా తప్పుచేస్తే వాళ్లు శిక్ష అనుభవిస్తారు నీకొచ్చిన నొప్పి ఏంటి అంటూ కౌశల్‌ పై ఫైర్  అయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. గీతామాధురి కూడా తనీష్ కి సపోర్ట్ చేయడంతో మరింత రెచ్చిపోయాడు. ఈ విషయంపై నాని.. కౌశల్, తనీష్ లతో మాట్లాడాడు. కౌశల్ రూల్స్ పాటించమని చెప్పడంలో తప్పేముందని తనీష్ ని అడిగాడు. వాయిస్ తగ్గించి మాట్లాడితే మంచిదంటూ హెచ్చరించారు. కౌశల్ కి నాని చురకలు అంటించారు. నాలాగే ఉండాలి.. నాకు నచ్చినట్లు ఉండాలంటే కుదరదని కౌశల్ ని ఉద్దేశించి కామెంట్స్ చేశారు.