బిగ్ బాస్ సీజన్ 2 ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ లో కౌశల్, తనీష్, దీప్తి నల్లమోతు, పూజా రామచంద్రన్ లు ఉండగా.. వీరి నలుగురిలో తక్కువ ఓట్లు వచ్చిన  కారణంగా పూజా హౌస్ నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆదివారం రాఖీ పండుగా కారణంగా హోస్ట్ నాని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఇంట్లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ తో రాఖీ కట్టించుకొని వారికి బహుమతులు అందించాడు.

దీప్తి నల్లమోతుని మరోసారి కెప్టెన్ గా అవకాశం ఇవ్వమని బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేశారు నాని. దానికి బిగ్ బాస్ కూడా అంగీకరించారు. హౌస్ మేట్స్ ఒక్కొక్కరికి సంబంధించిన మీమ్స్ ని స్క్రీన్ పై చూపిస్తూ వారితో కలిసి అల్లరి చేశాడు నాని. ఇలా సరదా సరదాగా సాగిపోతున్న షోని ఎలిమినేషన్స్ రౌండ్ తో సడెన్ గా వేడెక్కించారు. ముందుగా ఎలిమినేషన్ నుండి కౌశల్ సేఫ్ అవుతున్నట్లుగా ప్రకటించి ఆ తరువాత తనీష్, దీప్తిలు సేఫ్ జోన్ లో ఉన్నట్లు ప్రకటించారు.

పూజా వెళ్లిపోతుందని తెలియగానే హౌస్ లో వాతావరణం మొత్తం ఎమోషనల్ గా మారిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన పూజా.. మొదట్లో తన ఆటతో అందరినీ ఆకట్టుకుంది. గత రెండు వారాలుగా కొన్ని విషయాల్లో ఆమె కౌశల్ తో గొడవపడుతూ వచ్చింది. ఇక ఆమె ఎలిమినేట్ అవుతుందని ప్రకటించిన నాని హౌస్ లో ఆమె జర్నీని కంటెస్టెంట్స్ తో కలిసి వీక్షించారు. ఇక వెళ్తూ వెళుతూ పూజా బిగ్ బాంబ్ ని గీతామాధురిపై విసిరింది. దాని ప్రకారం ఈ వారం మొత్తం గీతా మాధురి జైలులోనే పడుకోవాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్2: ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకో.. గీతపై నాని కామెంట్స్!

బిగ్ బాస్2: నువ్ ఎవరు చెప్పడానికి..? కౌశల్ పై తనీష్ ఫైర్!