బిగ్ బాస్ సీజన్ 2 శనివారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. కౌశల్, తనీష్ గొడవ పడడం.. దీప్తిని కెప్టెన్ గా తొలగించడం వంటి విషయాలతో షో ఆసక్తికరంగా నడిచింది. కౌశల్, తనీష్ లు గొడవ పడ్డందుకు నాని వారికి చురకలు అంటించారు. గీతామాధురితో మాట్లాడిన నాని ఆమెకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందంటూ కామెంట్స్ చేశారు. గత రెండు వారాలుగా హౌస్ లో గీతామాధురి ప్రవర్తన పట్ల ప్రేక్షకుల్లో వస్తోన్న విమర్శలపై పరోక్షంగా ఆమెపై విరుచుకుపడ్డాడు నాని.

గతంతో పోల్చుకుంటే నీలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని.. మహా అయితే ఏం చేస్తారులే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నావంటూ, దీనివల్ల నష్టపోయే ఛాన్స్ ఉందంటూ చెప్పాడు నాని. ఆ తరువాత గీతా.. కౌశల్ గురించి నానితో చెబుతూ.. అతడి నుండి తప్పించుకొని తిరగాల్సి వస్తుందని, అతడు నాలాగే ఆడాలి, నాలాగే ఉండాలని చెప్పడం తనకు నచ్చలేదంటూ గీతా వెల్లడించింది. కామన్ మ్యాన్ గా హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన గణేశ్ ని టార్గెట్ చేసిన నాని.. దీప్తి ఎలిమినేట్ కావడానికి, కౌశల్-తనీష్ గొడవ పడడానికి మెయిన్ రీజన్ నువ్వు పడుకోవడమని దీనిపై వివరణ ఇవ్వాలని నాని గణేష్ ని అడిగారు.

నువ్వు కామన్ మ్యాన్ అనే ఒక్క కారణంతోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నావని, లేదంటే నీ పెర్ఫార్మన్స్ కి ఎప్పుడు ఎలిమినేట్ అయ్యేవాడివంటూ అతడిపై ఫైర్ అయ్యాడు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారే విషయాన్ని నాని రివీల్ చేయకుండా సస్పెన్స్ కొనసాగించారు.