బిగ్ బాస్2: మరోసారి తోపులాట.. ఈసారి ఏం జరుగుతుందో..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 10, Sep 2018, 11:37 AM IST
bigg boss2: fully charged up task for housemates
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. నిన్నటి ఎపిసోడ్ లో శ్యామల ఎలిమినేట్ కావడంతో హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు. తాజాగా సోమవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు 'ఫుల్లీ ఛార్జెడ్ అప్' అనే టాస్క్ ఇచ్చారు

బిగ్ బాస్ సీజన్ 2 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. నిన్నటి ఎపిసోడ్ లో శ్యామల ఎలిమినేట్ కావడంతో హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలి ఉన్నారు. తాజాగా సోమవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు 'ఫుల్లీ ఛార్జెడ్ అప్' అనే టాస్క్ ఇచ్చారు.

దీనికోసం హౌస్ మేట్స్ రెండు టీమ్ లుగా విడిపోయి తమకు ఇచ్చిన టాస్క్ ని పూర్తి చేయాలి. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ప్రోమోని బట్టి ఇదొక ఫిజికల్ టాస్క్ అని తెలుస్తోంది. మరోసారి ఒకరినొకరు తోసుకొని, ఎవరిలో ఎంత దమ్ముందో చూపించుకునే టాస్క్ ఇది. తనీష్, సామ్రాట్, అమిత్ ల మధ్య తోపులాట ఓ రేంజ్ లో జరగబోతోంది.

దీప్తి కూడా ఏం తగ్గడం లేదని తెలుస్తోంది. ఎప్పటిలానే ఫిజికల్ టాస్క్ కి కాస్త దూరంగా ఉండే గీతామాధురి ఈసారి కూడా అదే కంటిన్యూ చేసినట్లుంది. ఈ టాస్క్ పూర్తయిన తరువాత ఎలిమినేషన్ కి నామినేషన్స్ చేపట్టే అవకాశం ఉంది. 

 

సంబంధిత వార్తలు.. 

బిగ్ బాస్2: శ్యామల అవుట్.. టాప్ త్రీలో ఆ ముగ్గురే!

బిగ్ బాస్2: గీతామాధురి కోసం బిగ్ బాస్ గేమ్!

బిగ్ బాస్2: కారణం చెప్పి ఆమెను బయటకి పంపనున్నారా..?

 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader