బిగ్ బాస్2: కారణం చెప్పి ఆమెను బయటకి పంపనున్నారా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 9, Sep 2018, 1:33 PM IST
bigg boss2: shyamala to eliminate from house
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 ముగింపు దశకు చేరుకుంటుందనే క్రమంలో మరో వరం రోజుల పాటు ఈ షోని పొడిగించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. 

బిగ్ బాస్ సీజన్ 2 ముగింపు దశకు చేరుకుంటుందనే క్రమంలో మరో వరం రోజుల పాటు ఈ షోని పొడిగించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వారిలో ఒకరు ఈరోజు బయటకి వెళ్లనున్నారు.

ఈ వారం నామినేషన్స్ లో కౌశల్, దీప్తి, శ్యామల, అమిత్ లు ఉండగా.. కౌశల్ కి అత్యధిక ఓట్లు నమోదు కావడంతో అతడు ఈ వారం సేవ్ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన ముగ్గురిలో దీప్తికి ఎక్కువ ఓట్లు వచ్చాయని సమాచారం. ఇక శ్యామల, అమిత్ లకు ఓట్లు సమానంగా రావడంతో శ్యామలని బయటకి పంపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆమెను పంపడానికి కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

శ్యామల రెండు సార్లు హౌస్ లోకి  ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండో సారి హౌస్ లోకి వెళ్లేవారు బయట విషయాలను హౌస్ మేట్స్ తో చర్చించకూడదనే రూల్ ఉంది. కానీ శ్యామల మాత్రం బయట వ్యవహారాలను హౌ మేట్స్ కి చెప్పి రూల్స్ ని అతిక్రమించింది. ఇప్పుడు అదే కారణం చెప్పి శ్యామలని ఎలిమినేట్ చేయనున్నారని టాక్.

loader