బిగ్ బాస్2: శ్యామల అవుట్.. టాప్ త్రీలో ఆ ముగ్గురే!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 9, Sep 2018, 10:42 PM IST
bigg boss2: shyamala eliminated from house
Highlights

బిగ్ బాస్ 2 ఆదివారంతో 92 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈరోజు షోలో 'సిల్లీ ఫెలోస్' సినిమా హీరోలు సునీల్, అల్లరి నరేశ్ హౌస్ లోకి వచ్చి హౌస్ మేట్స్ తో కొంత సమయం గడిపారు. 

బిగ్ బాస్ 2 ఆదివారంతో 92 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఈరోజు షోలో 'సిల్లీ ఫెలోస్' సినిమా హీరోలు సునీల్, అల్లరి నరేశ్ హౌస్ లోకి వచ్చి హౌస్ మేట్స్ తో కొంత సమయం  గడిపారు. వారు ఉన్నంతసేపు షో చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది. వారితో కూడా నాని ఓ గేమ్ ఆడించి తనదైన హోస్టింగ్ స్కిల్స్ తో మెప్పించాడు. ఇక ఎలిమినేషన్ సమయానికి  వచ్చేసరికి ముందుగా దీప్తి నల్లమోతు సేవ్ అయినట్లు నాని ప్రకటించాడు.

ఆ తరువాత కౌశల్ పేరు చెప్పి ఫైనల్ గా శ్యామల ఎలిమినేట్ అయినట్లు అమిత్ సేవ్ అయినట్లు వెల్లడించారు. ఇదివరకే ఎలిమినేషన్ ని ఫేస్ చేసిన శ్యామల ఈసారి మాత్రం పెద్దగా ఎమోషనల్ అవ్వలేదు. బయటకి వెళ్లినప్పుడు మీ కుటుంబ సభ్యులతో ఏమైనా చెప్పాలా అంటూ హౌస్ మేట్స్ ని అడిగి తెలుసుకుంది.

స్టేజ్ మీదకి వచ్చిన శ్యామలని హౌస్ మేట్స్ ఒక్కొక్కరిపై ఒపీనియన్స్ అడిగి తెలుసుకున్న నాని ఈ షోలో టాప్ త్రీలో ఎవరుంటారని ప్రశ్నించగా దానికి శ్యామల.. గీతామాధురి, తనీష్, రోల్ రైడాల పేర్లు చెప్పింది. ఇక వెళ్తూ వెళ్తూ బిగ్ బాంబ్ ని పై విసిరింది. దీని ప్రకారం ఈ వారం మొత్తం హౌస్ మేట్స్ కి సేవకులుగా మారి వారి చెప్పిన పనులు చేస్తుండాలి!

సంబంధిత వార్తలు.. 

బిగ్ బాస్2: గీతామాధురి కోసం బిగ్ బాస్ గేమ్!

బిగ్ బాస్2: కారణం చెప్పి ఆమెను బయటకి పంపనున్నారా..?

 

loader