బిగ్ బాస్ సీజన్2 పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ షోని 106 రోజుల పాటు నడిపించనున్నారు. ఇప్పటికే 91 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు మరో వారం రోజుల పాటు ఈ షోని పొడిగించనున్నారని సమాచారం. కావాలనే బిగ్ బాస్ ఈ విధంగా చేస్తున్నారని టాక్. దీని వెనుక చాలా కారణాలున్నాయని చెబుతున్నారు.

ప్రస్తుతం ఆడియన్స్ లో కౌశల్ కి క్రేజ్ పెరగడంతో దాన్ని తగ్గించడానికి బిగ్ బాస్ కొంత సమయం తీసుకోబోతున్నాడని దానికోసమే వారం రోజులు షోని పొడిగించనున్నారని అంటున్నారు. ఈ గేమ్ లో గీతామాధురిని విజేతగా చేయడానికి బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తోందట. నిన్న ఎపిసోడ్ లో కూడా గీతామాధురికి బయట నుండి కాల్ వచ్చింది. ఇది ఆమెకి వచ్చిన రెండో కాల్.

ఈసారి లేడీ గెలవాలని ఆశిస్తున్నామంటూ కాలర్ గీతాతో చెప్పడంతో పబ్లిక్ అలానే ఫీల్ అవుతున్న సందేశాన్ని పంపించినట్లైంది. హోస్ట్ నాని కూడా గీతామాధురికి ఫేవర్ గా ఉన్నాడని అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నాడు నాని. బిగ్ బాస్ ఎలాంటి ప్లాన్స్ చేసినా.. ప్రస్తుతానికి జనాల్లో కౌశల్ కి ఉన్న క్రేజ్ తో ఓట్ల పరంగా ఆయన లీడింగ్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆడియన్స్ లో కౌశల్ క్రేజ్ ని ఎలా తగ్గిస్తారో చూడాలి!