బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ కి ఆయన అభిమానులు భారీ ఎత్తున సత్కరించారు. షో ముగించుకొని బిగ్ బాస్ సెట్ నుండి బయటకి వచ్చిన కౌశల్ కి బ్రహ్మరథం పట్టారు

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ కి ఆయన అభిమానులు భారీ ఎత్తున సత్కరించారు. షో ముగించుకొని బిగ్ బాస్ సెట్ నుండి బయటకి వచ్చిన కౌశల్ కి బ్రహ్మరథం పట్టారు. బాణాసంచాలు కాలుస్తూ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో సందడి చేశారు.

ఈ సందర్భంగా ఆయన ఇంటి వద్ద ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో కౌశల్ ని అతడి భార్య నీలిమని సత్కరించారు. ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడిన తీరు అభిమానులనుఆకట్టుకుంది. ఆయన చేసిన కామెంట్స్ తో తెగ మురిసిపోయారు.

''బిగ్ బాస్ హౌస్ లో అందరూ నన్ను బయటకి పంపాలని రాత్రి, పగలు కష్టపడ్డారు. మీరు కూడా రాత్రి, పగలు కష్టపడి ఇంట్లో వాళ్లని బయటకి తీసుకొచ్చారు. నామినేట్ చేయడం నా పని.. ఎలిమినేట్ చేయడం మీ పని'' అంటూ కౌశల్ చేసిన వ్యాఖ్యలు కౌశల్ ఆర్మీ సభ్యులు కేరింతలు కొట్టారు.

Scroll to load tweet…