ఉత్కంఠ మధ్య ఆమె సేఫ్... టాప్ కంటెస్టెంట్ సందీప్ అవుట్!
బిగ్ బాస్ సీజన్ 7లో 8వ ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైంది. ఉత్కంఠ మధ్య ఆట సందీప్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది.
గత వారం సీరియల్ నటి పూజ మూర్తి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక 8వ వారానికి శివాజీ, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక, అశ్విని, భోలే, గౌతమ్, సందీప్ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు నెక్స్ట్ సండే హౌస్ వీడాల్సి ఉంది. మంగళవారం నుండి ఓటింగ్ మొదలైంది. అనుకున్నట్లే శివాజీ ఓటింగ్ లో జోరు చూపించాడు. శివాజీ ఒక్కడికే 45% శాతం ఓట్లు పోలైనట్లు సమాచారం. అనూహ్యంగా రెండో స్థానంలో భోలే ఉన్నాడట.
ఇక మూడో స్థానంలో అమర్ దీప్, నాలుగో స్థానంలో అశ్విని ఉన్నారట. ఐదవ స్థానంలో గౌతమ్, ఆరో స్థానంలో ప్రియాంక ఉన్నారట. చివరి రెండు స్థానాల్లో సందీప్, శోభా ఉన్నారని. సందీప్, శోభా లలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయమన్న మాట వినిపించింది. ముఖ్యంగా శోభా ఇంటిన వీడటం అనివార్యమే అనుకున్నారు.
గత రెండు వారాలుగా శోభా గేమ్ దారుణంగా ఉంది. ఆమె యాటిట్యూడ్, మాట తీరు, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకుల్లో వ్యతిరేకతకు దారి తీశాయి. దాంతో శోభా శెట్టిని ఎలిమినేట్ చేయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించింది. ఇక ఓటింగ్ లో కూడా వెనుకబడిన శోభా ఇంటిని వెడుతుందని అంటుకుంటున్న తరుణంలో... షాకింగ్ ఎలిమినేషన్ చోటు చేసుకుందట. శోభాకి బదులు సందీప్ ఎలిమినేట్ అయ్యాడని సమాచారం.
ఆట సందీప్ కూడా మొదటి నుండి సీరియల్ బ్యాచ్ తో సన్నిహితంగా ఉంటున్నాడు. శివాజీ పవర్ అస్త్ర గెలిచి ఐదు వారాల ఇమ్యూనిటీ పొందారు. ఆరో వారం నామినేషన్స్ లో ఉండగా గౌతమ్ సేవ్ చేసి తప్పించాడు. ఏడోవారం ఒక ఓటు మాత్రమే పడింది. 8వ వారం అతడు నామినేషన్స్ లోకి వచ్చాడు. తేజా, యావర్, భోలే అతన్ని నామినేట్ చేయగా ఇంటిని వీడాడని తెలుస్తుంది.