హౌస్ నుండి ఎలిమినేట్ అయిన అలీ రెజా.. రీఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. హౌస్ నుండి బయటకు వచ్చిన అలీ రజా బయట టాక్ ఎలా ఉందో రవి, శివజ్యోతి, బాబాలతో చర్చించాడు. పీవీవీఆర్‌ (పునర్నవి, వరుణ్‌, వితికా, రాహుల్‌) బ్యాచ్‌ గురించి బాబా, శివజ్యోతి, రవిలతో అలీ చెప్పుకొచ్చాడు.

ఆ నలుగురు కలిసి ఉన్నంతవరకు వాళ్లు ఎలిమినేట్‌ కారు.. బయట బాగా స్ట్రాంగ్‌ ఉందని వాళ్లతో చెప్పాడు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో కలర్‌ఫుల్‌ కెప్టెన్‌ అని ఓ టాస్క్‌ ఆడించాడు బిగ్‌బాస్‌. కెప్టెన్సీ పోటీదారులైన శివజ్యోతి, బాబా, రవి, శ్రీముఖిలకు నాలుగు బౌల్స్ ఇచ్చాడు.

టాస్క్ ప్రకారం నలుగురు కెప్టెన్ పోటీదారులకు వివిధ రంగుల కలర్స్ బౌల్స్ ఇచ్చి అందులోని కలర్స్‌ని రెండు చేతులతోనూ పట్టుకుని కింద పడకుండా చూసుకోవాలని ఫైనల్‌గా ఎవరి బౌల్‌లో ఎక్కువ కలర్ ఉంటుందో వాళ్లే ఇంటికి కెప్టెన్‌ అవుతారని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.ఈ క్రమంలో బాబా భాస్కర్ చేతిలో నుండి అలీ రంగును తీసుకోవడంతో అతడు ఔట్ అయ్యాడు.

అలానే శివజ్యోతి మధ్యలో ఒక్క చేతితోనే బౌల్‌ను పట్టుకున్నందుకు పోటీ నుంచి తప్పుకున్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. చివరిగా రవి, శ్రీముఖిలలో హౌస్ మేట్స్ మద్దతు శ్రీముఖికి ఉండడంతో రవి హర్ట్ అయ్యాడు. ఈ వారం కెప్టెన్ అవ్వాలని భావించిన రవి ఆశ నెరవేరలేదు. ఇక అతడి చేతిలో బౌల్ వితికా లాగేయడంతో శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ గా నిలిచింది.