సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ అనంతరం ఎవరు ఊహించని విధంగా బాలకృష్ణ సరికొత్త లుక్ తో ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా స్టైలిష్ లుక్ తో దర్శనమిస్తున్నాడు. కేఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ కొత్త సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఆ సినిమాను నిర్మిస్తున్నారు. 

అయితే ఆ సినిమాకు సంబందించిన మరో లుక్ ని రిలీజ్ చేశారు. పింక్ కలర్ బ్లెజర్ లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న బాలయ్య అదిరిపోయే స్టిల్ ఇచ్చడాని నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. గతంలో కూడా ఇలాంటి లుక్ తో మంచి కిక్కిచ్చిన బాలకృష్ణ ఇప్పుడు కిక్కు డోస్ ఇంకాస్త పెంచినట్లు తెలుస్తోంది. మరి పోస్టర్స్ తోనే ఈ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్నాడు అంటే సినిమా రిలీజ్ తరువాత ఇంకెంత రచ్చ చేస్తారో చూడాలి.