ఎన్టీఆర్ ఇప్పట్లో కోలుకునేలా లేడు.. ఇది త్రివిక్రమ్ కి దెబ్బే!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 30, Aug 2018, 4:02 PM IST
Aravinda Sametha could be postponed
Highlights

జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ లో దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. నిజానికి మొదటి నుండి ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా..? రాదా..? అనే సందేహాలు నెలకొన్నాయి.

ఈ ఏడాది వేసవిలో మొదలుపెట్టిన ఈ సినిమాను అత్యంత వేగంగా పూర్తి చేసి దసరాకు విడుదల చేయాలనేది త్రివిక్రమ్ ప్లాన్. అనుకున్న ప్రకారమే షూటింగ్ ఎక్కడా డిలే లేకుండా చేసుకుంటూ వచ్చారు. ఓ పక్క షూటింగ్ చేస్తూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. దీంతో సినిమా అనుకున్న సమయానికి వచ్చే ఛాన్స్ ఉంటుందని కొందరు భావించారు. కానీ ఇప్పుడు ఈ చిత్రబృందానికి ఊహించని షాక్ తగిలింది.

ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కారు యాక్సిడెంట్ లో సడెన్ గా చనిపోయారు. తన తండ్రితో మంచి అనుబంధం ఉన్న తారక్ తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సమయంలో అన్నీ మర్చిపోయి షూటింగ్ లో మునుపటిలా పాల్గొనడానికి తారక్ కి చాలా సమయం పట్టేలా ఉంది. షూటింగ్ పూర్తి చేసినా.. తారక్ మీడియా ముందుకు వచ్చి సినిమాను ప్రమోట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇది త్రివిక్రమ్ పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అలా అని తారక్ ని బలవంతం కూడా పెట్టలేరు. కాబట్టి సినిమా అనుకున్న సమయానికి సినిమా రాకపోవచ్చనే తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి.. 

తారక్ అన్న.. నీ గురించే ఆలోచిస్తున్నాం: విజయ్ దేవరకొండ ట్వీట్!

కొడుకు కోరిక తీరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు!

నాన్న మమ్మల్ని అలా పెంచలేదు.. తండ్రి గొప్పదనాన్ని వివరించిన ఎన్టీఆర్!

ఎన్టీఆర్ విలపిస్తున్న తీరు ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది!

  

loader