విజయ్ సేతుపతికి తమిళంలోనే కాదు ఇప్పుడు తెలుగునాట కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విలన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన తన నటనతో అందరినీ మెప్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో అనుష్క వంటి స్టార్ హీరోయిన్ ఆయనకు భార్యగా నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ కేవలం మీడియా సృష్టించినవే అని తేలిపోయింది. అందులో నిజం లేదని అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. అంతేకాదు అసలు అనుష్క ఏ కొత్త సినిమా కూడా సైన్ చేయలేదు. అలాంటిది ఇలా ఓ సినిమాలో నటిస్తోంది..అంటూ డైరక్టర్,హీరో పేరు తో వార్తలు రావటంతో అనుష్క సైతం ఆశ్చర్యపోయారట. 

వివరాల్లోకి వెళితే..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్ర‌స్తుతం నిశ్శ‌బ్దం సినిమాను పూర్తి చేసి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బ్రేక్ లో ఆమె ఓ స్క్రిప్టు ని ఓకే చేసి ముందుకు వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. తన త‌దుప‌రి సినిమాని ప్రముఖ తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తమిళ  మీడియా హోరెత్తిపోయింది. ఈ మేరకు గత కొద్ది రోజులుగా డిస్కషన్స్ జరిగాయని, కరోనానుంచి కాస్తంత రిలీఫ్ వచ్చాక షూటింగ్ మొదలెడదామనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. అయితే అవన్నీ నిజం కాదని, అలాంటిదేమీ జరగలేదని అంటున్నారు.

ఇక ఇప్పటికే పూర్తైన నిశ్శబ్దం రిలీజ్ అయితే తనకు మరింతగా ప్లస్ అవుతుందని అనుష్క భావిస్తోంది. అయితే నిశ్శబ్దం విషయంలో ఓటీటిలో రిలీజ్ చేస్తారా లేక డైరక్ట్ తెరపైనే చూస్తామా అనే సందిగ్దత నెలకొని ఉంది. మరో ప్రక్క అనుష్క సినిమాల విషయం పక్కన పెడితే ప్రస్తుతం అందరూ ఆమె పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. నిశ్శబ్దం సినిమా విడుదల తర్వాత శుభవార్త చెబుతుందని అందరూ అనుకున్నారు.