బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, సీనియర్ నటి మలైకా చోప్రాతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని అంటున్నారు. ఈ మేరకు బాలీవుడ్ లో పలు కథనాలు వినిపిస్తున్నాయి.

కానీ ఈ జంట మాత్రం తమ ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై స్పందించడం లేదు. తాజాగా బాలీవుడ్ అగ్ర నటుడు అనీల్ కపూర్ తన కొడుకు వరుసయ్యే అర్జున్ ప్రేమ గురించి మాట్లాడారు. ఇటీవల నేహా ధుపియా చాట్ షోలో పాల్గొన్న ఆయనకి అర్జున్ కపూర్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

'అర్జున్, మలైకాకు ఏదైనా సలహా ఇస్తారా..?' అని హోస్ట్ నేహా ప్రశ్నించగా.. దీనిపై స్పందించిన అనీల్.. ''అర్జున్ గురించి నాకు బాగా తెలుసు. అతడి సంతోషమే నా సంతోషం. అతడి వ్యక్తిగత విషయం, చేసే పనుల గురించి కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. మా కుటుంబంలో ఎదుటి వ్యక్తి సంతోషమే.. మాకు ముఖ్యం'' అంటూ చెప్పుకొచ్చాడు.

మలైకాకి ఇదివరకే పెళ్లి జరిగింది. ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆమె విడాకులు తీసుకున్న తరువాత అర్జున్ తో బహిరంగంగానే ప్రేమాయణం సాగిస్తోంది. వీరిద్దరూ ముంబైలో ఓ ఇల్లు కూడా కొన్నారట. పెళ్లి చేసుకొని ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుతారని అంటున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

కుర్రహీరోతో పెళ్లిపై సీనియర్ నటి కామెంట్!

నేనున్నా కదా.. సీనియర్ నటికి కుర్ర హీరో భరోసా!

ఏ భర్త ఇలా చేసి ఉండడు.. విడాకులపై అర్భాజ్ ఖాన్ కామెంట్స్!

నువ్వు కుర్రాడితో తిరిగితే..నేను కుర్రపిల్లను లైన్లో పెట్టా

విడాకులు తీసుకున్న నటితో కుర్రహీరో పెళ్లి..?

విడాకుల హీరోయిన్ ప్రేమలో యంగ్ హీరో..?