Asianet News TeluguAsianet News Telugu

పాయల్ రాజ్‌పుత్ 'అన‌గ‌న‌గా ఓ అతిథి' రివ్యూ

డబ్బులేక నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆ ఇంటికి ఓ అనుకోని అతిధి వస్తాడు. అతను దగ్గర ఊహించనంత డబ్బు, నగలు ఉన్నాయి. అతనికి ఆశ్రయం ఇచ్చిన ఆ ఫ్యామిలికు దుర్బుద్ది పుడితే...ఏమౌతుంది. వినటానికి చాలా చిన్న పాయింటే కానీ ట్రీట్మెంట్ అదీ సినిమాకు తగ్గట్లు రాయటం చాలా కష్టం. అయితే చిన్న సినిమాకు కథే కాస్టలీగా ఉండాలి. కక్కుర్తిపడితే రోడ్డుమీదపెట్టేస్తుంది. కానీ కన్నడ దర్శకుడు దయాల్‌ పద్మనాభన్‌ సామాన్యుడు కాదు.ఈ పాయింట్ తో కరాళరాత్రి అనే సినిమా తీసి హిట్, మంచి పేరు సంపాదించాడు. ఆ సినిమా తెలుగులో ఆడుతుందనే ఆశ కలిగింది నిర్మాతలు. అంతే అదే డైరక్టర్ తో దాదాపు మక్కికి మక్కీ రీమేక్ చేయించేసారు. మరి తెలుగువాళ్లకూ ఈ కథ నచ్చుతుందా...అసలు ఈ సినిమా కథేంటి..అంతలా అవార్డ్ లు, జనాదరణ సంపాదించేటంత విషయం అందులో ఏముంది వంటి విషయాలు తెలియాలు రివ్యూలో చూద్దాం.

Anaganaga O Athidhi Telugu Movie Review jsp
Author
Hyderabad, First Published Nov 21, 2020, 4:38 PM IST


కథేంటి

లో మిడిల్ క్లాస్ అమ్మాయి మ‌ల్లి (పాయ‌ల్ రాజ్‌పుత్‌). గత వైభవం చెప్పుకునేందుకు ప్లాష్ బ్యాక్ గా మాత్రమే ఉంది. ప్రస్తుతం ప్రతీ పైసాకు పది సార్లు ఆలోచించాల్సిందే. చేసిన అప్పులు తీర్చలేక తమ పొలంలోనే కూలి పనులు చేయాల్సిన సిట్యువేషన్. ఏంటి జీవితం...ఇంక దీని నుంచి బయిటపడే మార్గమే లేదా..ఇలాగే పెళ్లీ పెడాకులు లేకుండా, దరిద్రం అనుభవిస్తూ జీవితం లాగించాల్సిందేనా అని ఆలోచనలో పదే పదే పడిపోతున్న ఆమె జీవితంలో ఓ సంఘటనతో మలుపు తిరుగుతుంది. ఓ రోజు రాత్రి వాళ్లింటికి  శ్రీ‌నివాస్ (చైత‌న్య కృష్ణ‌) అనే ఓ దేశ దిమ్మ‌రి గెస్ట్ లా వస్తాడు. ఒక్క నైట్ తలదాచుకు వెళ్లిపోతానంటాడు. మొదట్లో ఒద్దనుకున్నా ఆ తర్వాత మెల్లిగా కన్వీన్స్ అయ్యి..గెస్ట్ గా అతన్ని తమ ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. కాని అతను తమ జీవితాల్లోకి వచ్చేస్తాడని ఊహించరు. 

అతని దగ్గర ఉన్న డబ్బు, నగలు వాళ్లను ఎట్రాక్ట్ చేస్తాయి. ఆ గెస్ట్ ని గుర్తించలేని విధంగా చంపేస్తే అనే ఆలోచన వాళ్లను ఊపేస్తుంది. దురాశ దెయ్యమై అతన్ని చంపటానికి ఉసిగొలుపుతుంది. దాంతో అతను అడిగిన కోడి కూర వండి..అందులో విషం కలిపేస్తాడు. ఆ అతిథికి ఆ కూర వడ్డించి, యముడుకు ఆహ్వానం పంపుదామనుకుంటారు. అయితే అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది. అతన్ని చంపే క్రమంలో అనుకోని అవాంతరాలు ఎదురౌతాయి. వాటిని అధిగమించి అతన్ని చంపేసారా..ఆ డబ్బుని వాళ్లు సొంతం చేసుకున్నారా..చివరకు ఏమైంది. ఈ క్రైమ్ లో మల్లి పాత్ర ఎంతవరకూ ఉంది, అసలు ఆ గెస్ట్ వీళ్ల ఇంటినే ఎన్నుకోవటానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది
నిజానికి ఈ సినిమా ఉన్నది 132 నిముషాలే అయినా నాలుగైదు గంటల సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. కన్నడంలో ఆ కారాళరాత్రి టైటిల్ తో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆ డైరక్టరే తెరకెక్కించటమే మైనస్ అయ్యింది. తెలుగు సెన్సిబులిటీస్, ఇక్కడ జీవితం, మనుష్యుల ఆలోచన ధోరణిని కన్నడ దర్శకుడు పట్టింకులేదు. కన్నడ సినిమాకు ట్రూ టాన్సలేషన్ గా ఈ సినిమా రీమేక్ చేసారు. అసలు ఈ సినిమా కథలోకి వెళ్లటానికే ఎక్కువ టైమ్ తీసుకోవటంతో..ఫస్టాఫ్ దేనిగురించి ఈ సినిమా చాలా సేపు అర్దం అయ్యినట్లు,కానట్లు ఉంటుంది. ఎటువైపు కథ డ్రైవ్ వెళ్తుందో తెలియదు. దానికి తోడు చాలా స్లో నేరేషన్. ఓ నాటకం చూస్తున్న ఫీలింగ్ చాలా సార్లు వచ్చిందంటే అది కథన లోపమే. క్యారక్టర్స్, కథలోని మలుపుపై పెట్టిన శ్రద్ద సినిమాలో మెయిన్ కంటంట్ పై పెట్టలేదనిపిస్తుంది. కన్నడ ప్రేక్షకుడు వేరు, వారి ఎమోషన్స్ వేరు. అందుకే కన్నడ రీమేక్ లు, డబ్బింగ్ లు ఇక్కడ పెద్దగా ఆడిన దాఖలాలు తక్కువ. మనకన్నా వాళ్లు చాలా వెనకబడ్డారని ఫీలింగ్ వస్తుంది. అలాగని పూర్తిగా కొట్టిపారేయటానికి లేదు. సెకెండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ లో సస్పెన్స్,  ట్విస్ట్ లు స్పెషల్ గా అనిపిస్తాయి. సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కాబట్టి చివరి ఐదు నిముషాల దాకా అసలు మ్యాటరేంటనేది రివీల్ కాదు. అయితే ఆ సస్పెన్స్ కొందరు రెగ్యులర్ సినిమా బ్యాచ్ పసిగట్టేస్తారు. మరికొందరు మొదటే వడగట్టేస్తారు. 

ఎవరెలా..
ఆర్ ఎక్స్ 100 సినిమాతో పరిచయమైన పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించింది. ఆమె తన పాత్రకు తగ్గట్లు… తన నటన తో ఆకట్టుకుందని చెప్పాలి. దురాశ..దుఃఖం ఆమె తన కళ్లతో,బాడీ లాంగ్వేజ్ తో బాగా పలికించింది. ఇక చైతన్య కృష్ణ నటుడుగా మరో మెట్టు ఎక్కారు. ఆయన కోసమే ఈ పాత్ర పుట్టిందన్నట్లు ప్రాణం పోసారు. మిగతా వాళ్లలో నల్ల వేణు, వాసు ఇంటూరి తప్పించి అంతా మనికి పరిచయం బ్యాచే. 

టెక్నికల్ గా...
మొదటే చెప్పుకున్నట్లు ..తెలుగులో ఓ కన్నడ సినిమా చూసినట్లు అనిపిస్తుంది. అది దర్శకుడు పొరపాటే. తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు ఇక్కడ ఆర్టిస్ట్ లను తీసుకోవటం కాదు...కథలో సీన్స్ ని ఇక్కడ నేటివిటికి తగ్గట్లు కొద్దిపాటి మార్పులు చేయాలి. అది చేయలేదు. ఇక డైలాగులు విషయానికి వస్తే డబ్బింగ్ వాసనలు వచ్చాయి. దర్శకుడుగా దయాల్‌ పద్మనాభన్‌ మేకింగ్ బాగుంది.  బడ్జెట్ లిమిటేషన్స్ లోనూ క్వాలిటీ సినిమా ఇచ్చారు. కెమెరామెన్ రాకేష్ బి. కొన్ని సీన్స్ లో దుమ్ము రేపారు.  మ్యూజిక్ డైరక్టర్ అరోల్ కొరెల్లి సోసో.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం అంతంత మాత్రం. ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగానూ లేవు...ఈ కథకు అవి సరిపోతాయనిపించింది. అలాగే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పిన వాయిస్ లు అసలు సెట్ కాకపోవటం మరో విషాదం.

ఫైనల్ థాట్
ఈ సినిమాని కష్టపడి తెలుగులో రీమేక్ చేసేబదులు..కన్నడ డబ్బింగ్ చేసినా పెద్ద తేడా ఏమీ ఉండేది కాదు. పాయిల్ వల్ల ప్రత్యేకంగా పాముకున్నది ఏమీ లేదు.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
Review:2

ఎవరెవరు..

నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ, ఆనంద చక్రపాణి, వీణా సుందర్ నల్ల వేణు తదితరులు
 నిర్మాతలు: రాజా రామమూర్తి, చిదంబరం నడేసన్ 
దర్శకత్వం: దయాళ్ పద్మనాభన్ 
ఆర్ట్: విఠల్ కోసనం 
మాటలు: కాశీ నడింపల్లి 
సినిమాటోగ్రఫి: రాకేశ్ బీ 
సంగీతం: అరోల్ కోరేలి 
బ్యానర్: ట్రెండ్ లౌడ్ 
రిలీజ్ డేట్: 2020-11-20 
స్ట్రీమింగ్ ఓటీటి: ఆహా యాప్
 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios