Asianet News TeluguAsianet News Telugu

'ఉప్పెన' రిలీజ్ మ్యాటర్, అదే ఫైనల్

అయితే గతంలో ఇలాంటి వార్తలు చాలా సార్లు వచ్చాయి కానీ చిత్ర టీమ్ ఖండిస్తూ వచ్చింది. అయితే ఈ సారి మాత్రం థియోటర్ రిలీజ్ ని ప్రక్కన పెట్టి ఓటీటికే వెళ్లిపోతే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చిందిట. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్దితుల్లో  థియోటర్స్ లో రిలీజ్ చేసినా జనం ధైర్యం చేసి వస్తారో లేదో తెలియదు.. ఎంత రెవిన్యూ వస్తుందో అసలే తెలియదు. 

Amazon Prime has come up with a juicy offer to own Uppena rights
Author
Hyderabad, First Published Oct 5, 2020, 10:51 AM IST

మెగాస్టార్‌ మేనల్లుడు వైష్టవ్‌ తేజ్‌ తొలి చిత్రం ఉప్పెనా ఏప్రిల్ 5 న తెరపైకి రావాల్సి ఉంది, అయితే కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ అమలు కారణంగా నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలన్నీ ఎక్కువ శాతం ఓటీటీ వేదికనే నమ్ముకున్నాయి. తాజాగా ఈ సినిమాని ఓ డిజిటల్‌ మీడియా చిత్ర హక్కులను సొంతం చేసుకోవడానికి సంప్రదించారట.

 అయితే గతంలో ఇలాంటి వార్తలు చాలా సార్లు వచ్చాయి కానీ చిత్ర టీమ్ ఖండిస్తూ వచ్చింది. అయితే ఈ సారి మాత్రం థియోటర్ రిలీజ్ ని ప్రక్కన పెట్టి ఓటీటికే వెళ్లిపోతే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చిందిట. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్దితుల్లో  థియోటర్స్ లో రిలీజ్ చేసినా జనం ధైర్యం చేసి వస్తారో లేదో తెలియదు.. ఎంత రెవిన్యూ వస్తుందో అసలే తెలియదు. 

డిస్ట్రిబ్యూటర్స్ ఇదే పాయింట్ రైజ్ చేసి చాలా తక్కువ రేటుకు సినిమాను అడుగుతున్నారట.  అదే ఓటీటిలో అయితే ఫిక్సెడ్ గా ఇంతని వస్తుంది. టైమ్ బాగుంటే తర్వాత థియోటర్ లో రిలీజ్ చేసుకుని సొమ్ము చేసుకోవచ్చు అని భావిస్తున్నారట. ఈ మేరకు అమెజాన్ వారితో చర్చలు జరుగుతున్నాయట.  పే పర్ వ్యూ పద్దతిన రిలీజ్ చేద్దామని భావిస్తున్నారట. డీల్ ఓకే అయితే అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ ఇస్తారు.  అయితే  హీరో వైష్ణవ్‌ తేజ్‌కు కూడా ఓటీటీ కంటే నేరుగా థియేటర్లోనే విడుదల చేయాలనే ఆశ ఉందట. ఎందుకంటే అతను నటించిన తొలి చిత్రం ఇదే కనుక. 
 
మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతున్నఈ చిత్రాన్నిబుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి విడుదలైన ‘‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమే అందుట్లో పడవ ప్రయాణం’’ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇందులో విజయ్‌ సేతుపతి - రాయమన్‌ అనే పాత్రలో విలన్ గా దర్శనమివ్వనున్నారు. చిత్రానికి నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, సుకుమార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 
   

Follow Us:
Download App:
  • android
  • ios