Asianet News TeluguAsianet News Telugu

బన్నీ సినిమా అధికార ప్రకటన రేపే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమా ఎవరితో అనే విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ సినిమా ఏ బ్యానర్ పై తెరకెక్కుతోంది, మిగతా వివరాలు బయటకి రాలేదు. 

allu arjun trivikram movie official announcement will be out tomorrow
Author
Hyderabad, First Published Nov 6, 2018, 12:28 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమా ఎవరితో అనే విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ సినిమా ఏ బ్యానర్ పై తెరకెక్కుతోంది, మిగతా వివరాలు బయటకి రాలేదు.

కానీ ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రేపు రానుంది. దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా గీతాఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయనుంది. 

బ్యానర్ ఫైనల్ అయిన తరువాత మరోసారి పూర్తి వివరాలతో అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకి నిర్మాతగా ఎవరున్నా.. గీతాఆర్ట్స్ బ్యానర్ మాత్రం సహ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం హీరో, దర్శకుడి కాంబినేషన్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోబోతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సివున్నాయి!

ఇవి కూడా చదవండి.. 

బన్నీ - త్రివిక్రమ్.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

త్రివిక్రమ్-బన్నీ సినిమాలో హీరోయిన్ ఎవరంటే..?

త్రివిక్రమ్ తో బన్నీ పక్కా.. ప్రాజెక్ట్ వివరాలు!

త్రివిక్రమ్ కొత్త చిత్రంలో బన్ని క్యారెక్టర్.. షాకింగ్

హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న అల్లు అర్జున్!

 

Follow Us:
Download App:
  • android
  • ios