బిగ్ బాస్ హౌస్ రెండు టీమ్స్ గా విడిపోయింది. దీనితో ఒక టీమ్ కి మరొక టీం సభ్యులు టార్గెట్ గా మారారు. టాస్క్ లో భాగంగా అఖిల్ హౌస్ లో సీక్రెట్ రూమ్ లో ఉండి, మిగతా ఇంటి సభ్యుల గేమ్, వాళ్ళు తన గురించి చేస్తున్న కామెంట్స్ గమనిస్తున్నాడు. అఖిల్ బయటికి వెళ్లిపోయాడని మోనాల్ కన్నీళ్లు పెట్టుకోగా, అభిజిత్ అఖిల్ ని స్ట్రాంగ్ కంటెస్టెంట్ హోదాలో బయటికి పంపలేదని, అతన్ని ఇంటి సభ్యులు వద్దనుకోవడం వలెనే బయటికి వెళ్లాల్సి వచ్చింది అన్నారు. 

కాగా నిన్న బిగ్ బాస్ ఇంటి సభ్యుల కోసం వారి కుటుంబ సభ్యులు రాసిన లేఖలు అందించారు. ఫ్యామిలీ పంపిన లేఖ అందుకోవాలంటే, ఇంటి సభ్యులు ఇంత వరకు ఎవరికీ తెలియని తమ లైఫ్ సీక్రెట్ ని చెప్పాలని అన్నాడు. సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్ ఇంటి సభ్యులు చెప్పిన సీక్రెట్ ఆధారంగా వాళ్లకు వచ్చిన లెటర్ ఇచ్చేది లేనిది నిర్ణయించాలి అన్నాడు. ఈ టాస్క్ లో అఖిల్ అందరి సీక్రెట్స్ విన్నారు. అందరికీ లెటర్స్ ఇచ్చిన అఖిల్, ఆరియానా, అవినాష్ లకు మాత్రం ముక్కలుగా చేసిన లెటర్ పంపారు. 

అవినాష్ చెప్పిన సీక్రెట్ గతంలో నాకు చెప్పాడన్న అఖిల్, ఆరియానా చెప్పింది సీక్రెట్ కాదనే కారణాలు చెప్పి, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రేమతో పంపిన లెటర్స్ వారికి దక్కకుండా చేశాడు. మిగతా సభ్యులు చెప్పిన సీక్రెట్స్ అంగీకరించిన అఖిల్ అవినాష్, ఆరియానాలవి సీక్రెట్స్ కాదనడం గమనార్హం. ఈ టాస్క్ లో అఖిల్ పక్షపాతం చూపినట్లు స్పష్టంగా అర్థం అయ్యింది. అమ్మ రాజశేఖర్, అవినాష్ మరియి ఆరియానాలను వేరు చేసిన మిగతా ఇంటి సభ్యులు అదే విధంగా ప్రవర్తిస్తున్నారని స్పష్టం అయ్యింది.