సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఘటనలు బయటకి వస్తూనే ఉన్నాయి. గతేడాది 'మీటూ' అనే ఉద్యమం ఉధృతంగా సాగింది. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. తాజాగా మరో నటి తాను ఎదుర్కొన్న ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ ఘటన గురించి వెల్లడించింది. నటి సుర్వీన్ చావ్లా కొన్ని టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించింది. 

ప్రముఖ వెబ్ సిరీస్ సేక్రెడ్ గేమ్స్ లో కూడా నటించింది. అయితే ఓ సినిమా షూటింగ్ సమయంలో  ఓ దర్శకుడు తన శరీర భాగాలను చూడాలనుకున్నాడని, మరో దర్శకుడు తన తొడలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటున్నానంటూ అసభ్యంగా ప్రవర్తించారని షాకింగ్ కామెంట్స్ చేసింది సుర్వీన్.

ఆ దర్శకుల పేర్లను మాత్రం బయటపెట్టలేదు. తన కెరీర్ లో మొత్తం ఐదు సార్లు కాస్టింగ్ కౌచ్ సంఘటనలను ఎదుర్కొన్నానని.. మూడు సార్లు దక్షిణాదిలో రెండు సార్లు బాలీవుడ్ లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పారు. తను టీవీలో ఎక్కువ కనిపించడంతో సినిమాలకు పనికి రానని చాలా మంది అన్నారట.

దీంతో ఏడాది పాటు మాత్రమే టీవీలో నటించానని ఒక్కోసారి అబద్ధం చెప్పాల్సి వచ్చిందని.. కానీ ఇలా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నానని అనిపించిందని చెప్పుకొచ్చింది సుర్వీన్. సుర్వీన్ నటించిన చివరి చిత్రం 2017లో వచ్చిన ‘ఛురీ’. 2015లో సుర్వీన్ అక్షయ్ థక్కర్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. సుర్వీన్, అక్షయ్ దంపతులకు ఓ బాబు ఉన్నాడు.