తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలకు విలక్షణ నటుడు ఆర్‌.మాధవన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఫస్ట్ నువ్వు డాక్టర్‌కి చూపించుకో అంటూ మండిపడ్డారు. ఇంతకి మాధవన్‌పై ఆరోపణలు చేసింది కూడా డాక్టర్‌ కావడం గమనార్హం. మరి అసలేం జరిగిందటే. తాజాగా మాధవన్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించారు. ఓపికగా చాలా మందికి సమాధానం ఇచ్చారు. 

అయితే ఇందులో ఓ లేడీ డాక్టర్‌.. మాధవన్‌ డ్రగ్స్ కి అలవాటు పడి, కెరీర్‌ని నాశనం చేసుకుంటున్నాడని విమర్శించింది. `నేను మాధవన్‌కి పెద్ద అభిమానిని. కానీ అతను ప్రస్తుతం డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు. మద్యానికి బానిసయ్యాడు. అటు కెరీర్‌ని, ఇటు ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాడు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడెలా ఉంటున్నాడు? అతనేం చేస్తున్నాడో అతని మొహం చూస్తేనే తెలుస్తుంద`ని ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. 

దీనికి మాధవన్‌ ఘాటుగా స్పందించారు. ఓహో.. మీరు రోగ నిర్ధారణ చేసేది ఇలాగన్న మాట. పాపం. మీ పేషెంట్లని చూస్తుంటే నాకు జాలేస్తుంది. నువ్వు వీలైతే త్వరగా  డాక్టర్‌కి చూపించుకోవడం మంచిదని` కౌంటర్‌ ఇచ్చాడు. దీంతో కాసేపటికే ఆమె తన ట్విట్టర్‌ పోస్ట్‌ని డిలీట్‌ చేయడం విశేషం. అయితే మాధవన్ కి సపోర్ట్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సదరు డాక్టర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. మాధవన్‌ అద్భుతమైన నటుడని, ఆయనేంటో ఐదు సార్లు నిరూపించుకున్నారని, ఆయనకు టఫ్‌ రోల్‌ అనేదే ఉండదని ప్రశంసిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఇప్పటికీ మాధవన్‌ సింపుల్‌ లైఫ్‌నే గడుపుతున్నారట. తాను ఇప్పటికీ రెంట్‌ హౌజ్‌లోనే ఉంటున్నానని, తాను డౌన్‌ టు గో పర్సన్‌ అని ఓ ప్రశ్నకి సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం మాధవన్‌ `మారా` చిత్రంలో నటిస్తున్నారు. కొత్త దర్శకుడు దిలిప్‌ కుమార్‌ రూపొందిస్తున్న ఈ రొమాంటిక్‌ డ్రామా చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ నెల 8న సినిమా విడుడల కానుంది. దీంతోపాటు `రాకెట్రీః ది నాంబి ఎఫెక్ట్` చిత్రంలో నటిస్తున్నారు.