ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ పిరామల్ కి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లైన తరువాత శుక్రవారం రాత్రి గ్రాండ్ గా వివాహ విందుని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకి బాలీవుడ్ సెలబ్రిటీలందరూ తరలివచ్చారు.

అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, షారుఖ్ ఖాన్, దీపిక పదుకోన్ ఇలా చాలా మంది తారలు హాజరయ్యారు. వీరు అతిథులకు భోజనాలను వడ్డించారు. వారు అలా వడ్డిస్తున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీంతో నెటిజన్లు చాలా మంది సెలబ్రిటీలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంబానీ ఇంట్లో పనివాళ్లే లేరా మీరు వడ్డిస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనిపై స్పందించిన అభిషేక్.. ''ఇలా భోజనాలు వడ్డించే సంప్రదాయాన్ని 'సజ్జన్ ఘోట్' అంటారు. వధువు తరఫు కుటుంబీకులు వరుడి తరఫు వారికి భోజనాలు వడ్డిస్తారు'' అని సమాధానమిచ్చారు.

ఇక అంబానీ ఈ పెళ్లి కోసం దాదాపు రూ.700 కోట్లకు పైగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో అంబానీ ఇంట్లో అతడి పెద్ద కుమారుడు వివాహం జరగనుంది. 

అంగరంగ వైభవంగా ఈశా- అజయ్ పెళ్లి.. అతిరధుల దీవెనలిలా

ఈషా అంబానీ పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా...?

అంబానీ సంగీత్.. సల్మాన్ బ్యాక్ డ్యాన్సర్ అయిపోయాడుగా!

అంబానీ పెళ్లి సందడిలో ప్రభాస్.. స్పెషల్ ఎట్రాక్షన్!