దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా నిలిచిన ఈశా అంబానీ- ఆనంద్‌ పిరమాల్‌ల వివాహ వేడుక బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి వేదికయిన ముకేశ్‌ అంబానీ స్వగృహం ‘యాంటిలియా’ను దేశ విదేశాల నుంచి తెచ్చిన పలు రకాల పూలు, విద్యుద్దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గృహాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ కుబేరుడి సౌధం, ఈ అలంకరణతో మరింత ఆకర్షణీయంగా మారింది. పెళ్లికుమార్తె ఈశాను సోదరులు ఆకాశ్‌, అనంత్‌, అన్‌మోల్‌ తదితరులు ముత్యాలతో అలంకరించిన ఛాదర్‌ పట్టి మండపానికి తీసుకువచ్చారు.

నృత్య కళాకారులతో బారాత్‌ బృందం ముందు రాగా ఆ వెనకే రోల్స్‌ రాయల్‌ కారులో వరుడు ఆనంద్‌ పిరమాల్‌, తన  కుటుంబసభ్యులతో కలిసి యాంటిలియాకు చేరుకున్నారు. పెళ్లికుమార్తె సోదరులు అశ్వాలను అధిరోహించి సందడి చేశారు. ముకేశ్‌, అనిల్‌ అంబానీ సోదరులు పెళ్లి కొడుకును సాదరంగా స్వాగతించి వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత సంప్రదాయ పద్ధతిలో ఈశా, ఆనంద్‌ వివాహం జరిగింది.

ఈ వివాహ వేడుకకు హిల్లరీ క్లింటన్‌, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, అమితాబ్‌ దంపతులు, రజనీకాంత్‌ దంపతులు, ఐశ్వర్య-అభిషేక్‌ బచ్చన్‌, సచిన్‌-అంజలి టెండూల్కర్‌, ఆమీర్‌ ఖాన్‌- కిరణ్‌ రావు, సల్మాన్‌ఖాన్‌, ప్రియాంకా చోప్రా-నిక్‌ జోనాస్‌, అనిల్‌కపూర్‌, సోనమ్‌కపూర్‌, రణ్‌వీర్‌సింగ్‌-దీపికా పదుకొనే, కరీనాకపూర్‌-సైఫ్‌, కైరా అడ్వానీ, సీఎంలు మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

ఈశా అంబానీ పెళ్లి కోసం ముంబైలోని ముకేశ్‌ నివాసం యాంటీలియాలో విలాస వంతమైన ఏర్పాట్లు చేశారు. ఈశా వివాహానికి 100మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.718 కోట్లు)ఖర్చు పెట్టారట. అయితే ఇందులో నిజం లేకపోలేదని ముకేశ్‌ అంబానీకి ఒక్కగానొక్క కూతురు కావడంతో వాళ్ల స్థాయికి తగ్గట్టే ఇంత ఖర్చు పెట్టే అవకాశం ఉందని అంబానీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఈశా పెళ్లి ఖర్చుపై వచ్చిన వార్తలు నిజమైతే ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్న వారిలో వీళ్లది రెండో జంటగా నిలుస్తుంది. 37 ఏళ్లతం యువరాజు చార్లెస్‌, డయానాల వివాహానికి 110మిలియన్‌ డాలర్లు వెచ్చించారు.
క్రి