సల్మాన్ ఖాన్ అంటే ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న బాక్స్ ఆఫీస్ హీరో అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఏడాదికి ఒక్క సినిమా చేసి కొన్నేళ్ళ వరకు ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తాడు. అయితే అలాంటి హీరో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం అంబానీ కూతురి ఈషా వివాహ వేడుకలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న ముంబై లో ఆనంద్ పిరమిల్ ఇషా మేడలో మూడు ముళ్ళు వేయనున్నారు. అయితే రీసెంట్ గా జరిగిన సంగీత్ వేడుకలో ఆకాష్ అంబానీ - ఇషా అంబానీ కోయ్ మిల్ గయా అనే సాంగ్ తో అందరిని అలరించారు. 

ఇక వారి వెనుక సింపుల్ గా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ధీరుడు సల్మాన్ ఖాన్ చిన్నపాటి బ్యాక్ డ్యాన్సర్ గా స్టెప్పులు వేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. అంబానీ ఏ స్థాయిలో తన కూతురి వివాహ వేడుకలను జరుపుతున్నారో అని చర్చించుకుంటున్నారు. ఇక అమిర్ ఖాన్ - షారుక్ ఖాన్ కూడా సంగీత్ లో ఇతర నటీనటులతో కలిసి ఆనందంగా స్టెప్పులు వేసి ఆకర్షించారు.