ఆర్ ఎక్స్ 100 తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తికేయ ఆ తర్వాత  దాన్ని ఉపయోగించుకుని మంచి సినిమాలు చేయలేకపోయాడు. క్రితం సంవత్సరం కార్తికేయ చేసిన మూడు సినిమాలు కూడా ప్లాపయ్యాయి. హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడర్ సినిమాలు మంచి ఫలితాల్ని ఇవ్వలేదు. దీంతో కార్తికేయ 90ml అనే  ఇంట్రస్టింగ్  కాన్సెప్ట్ తో సినిమా చేసాడు. టీజర్, ట్రైలర్ వరకూ చూసుకుంటే ఈ సినిమా బాగుందనే అనిపించింది.  సినిమా చూసాక కూడా అదే ఫీల్ కలుగలేదు. సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయింది. ఈ సినిమాను చివరి వరకు చూడటం కష్టమని రివ్యూలు వచ్చాయి. 

దాంతో మార్నింగ్ షోకే ఈ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి. అయితే అదే ఇప్పుడు టీవికు కలిసొచ్చింది. థియోటర్ లో ధైర్యం చేసి చూడలేకపోయిన వారు, ఈ సినిమాపై ఇంట్రస్ట్ ఉన్నావాళ్ళు టీవీ ప్రీమియర్ షో మిస్సవకుండా చూసారు. అలాగే లాకౌడౌన్ టైమ్ కూడా కలిసొచ్చింది. దాంతో టీవీల్లో ఈ  సినిమా ఇప్పుడు సూపర్ హిట్టయింది.  90ml సినిమాకు బుల్లితెరపై మంచి టీఆర్పి రేటింగ్ లు వచ్చాయి. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో 2వ తేదీన ప్రసారమైన ఈ సినిమాకు ఏకంగా 10.92 (అర్బన్) టీఆర్పీ రావడం విశేషం.ఎవరూ కూడా ఈ స్థాయి టీఆర్పీ ఊహించి లేదు . దాంతో చాలా హ్యాపీగా ఉన్నారు ఆ చిత్రం టీమ్. 

ఇక రేటింగ్స్ లో రెండో స్థానంలో సరైనోడు, మూడో స్థానంలో సంక్రాంతి సినిమాలు నిలవగా.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చిన లోకల్ బాయ్ నాలుగో స్థానంలో నిలిచింది. ధనుష్ నటించిన ఈ సినిమాకు (7.19 -అర్బన్) టీఆర్పీ వచ్చింది. అలాగే ఈ వారం కూడా టాప్-5లో ఈటీవీ న్యూసే నిలిచింది.  మొత్తం మీద ఈ వారం రేటింగ్స్ పరంగా జెమినీ ఛానెల్ టాప్ లో నిలిచింది. రెండో స్థానంలో స్టార్ మా నిలిచింది.