నటి భానుప్రియ కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. మైనర్ బాలిక సంధ్యతో పాటు మరో ఇద్దరు బాలికలతో ఆమె వెట్టిచాకిరి చేయించిందని ఓ స్వచ్చంద సంస్థ దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. సంధ్యతో పాటు భానుప్రియ ఇంట్లో శైలు, రమాప్రభ అనే ఇద్దరు బాలికలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఇద్దరు కూడా వడ్లమూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. తమను 2015 లోనే భానుప్రియ పనిలోకి పెట్టుకుందని ఈ బాలికలు చెబుతున్నారు. రత్నప్రభ అనే బాలిక తమతో పాటు పని చేసే శైలు అనే అమ్మాయిని రెండు నెలల క్రితమే ఇంటికి పంపించేసినట్లు తెలిపింది.

తాజాగా సంధ్య గొడవ నేపధ్యంలో తనను కూడా ఇంటికి వెళ్లిపోవాలని భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ తెలిపాడని రమాప్రభ చెబుతోంది. స్వచ్చంద సంస్థ కేసుతో రంగంలోకి దిగిన చైల్డ్ లేబర్ అధికారులు ఈ కేసుపై విచారణ చేపట్టారు. సోమరాజు అనే వ్యక్తి ఈ ఇద్దరు బాలికలను పనిలోకి పెట్టినట్లు తెలుసుకున్నారు. 

నెలకు నాలుగు వేలు జీతమిస్తూ సదరు బాలికలతో భానుప్రియ వెట్టిచాకిరి చేయించుకుందని చైల్డ్ లేబర్ అధికారులు చెబుతున్నారు. ఇక మైనర్ బాలిక సంధ్య కేసులో చెన్నై పోలీసులు మరి ట్విస్ట్ ఇచ్చారు.

భానుప్రియ ఇంట్లో తాను ఎలాంటి వేధింపులకు గురికాలేదని సంధ్య చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. మరి ఈ నేపధ్యంలో బాలల హక్కుల చట్టం అధికారులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి!

భానుప్రియకు మరిన్ని చిక్కులు: అరెస్ట్ కు డిమాండ్!

భానుప్రియపై కేసు: మైనర్ బాలిక స్టేట్మెంట్

చిన్నారిపై వేధింపులు.. స్పందించిన భానుప్రియ!

మైనర్ బాలికపై లైంగిక దాడి.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ నిర్వాకం!