ఒకప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియ తన ఇంట్లో పని చేస్తోన్న సంధ్య అనే మైనర్ బాలికను హింసిస్తోందని, భానుప్రియ సోదరుడుసంధ్యపై లైంగిక దాడి చేసినట్లు నిన్న వార్తలు వచ్చాయి. సంధ్య తల్లి ప్రభావతి ఈ విషయంపై సామర్లకోట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

దీంతో సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. సోషల్ మీడియాలో భానుప్రియపై విమర్శలు మొదలయ్యాయి. విషయం పెద్దది కావడంతో భానుప్రియ స్పందిస్తూ.. సంధ్య తమ ఇంట్లో దొంగతనం చేసేదని, గట్టిగా నిలదీసేసరికి సంధ్య తల్లి డ్రామా చేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చింది.

అంతేకాదు.. సంధ్యను వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లింది భానుప్రియ. పోలీసుల ముందు మైనర్ బాలిక సంధ్య తనను ఎవరూ గృహనిర్బంధం చేయలేదని, భానుప్రియ ఇంట్లో తాను సంతోషంగానే ఉన్నట్లు తెలిపింది. భానుప్రియ సోదరుడు కూడా తనతో తప్పుగా ప్రవర్తించలేదని స్పష్టం చేసింది.

సంధ్య ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ కేసులో భానుప్రియకి కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. దీంతో ఇప్పుడు అసలు తప్పు భానుప్రియదా..? లేక సంధ్య తల్లి ప్రభావతిదా..? అనే విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు చెన్నై పోలీసులు. 

చిన్నారిపై వేధింపులు.. స్పందించిన భానుప్రియ!

మైనర్ బాలికపై లైంగిక దాడి.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ నిర్వాకం!